Devara 20 Days Collections: దేవర మరో రికార్డు.. ప్రభాస్ రేంజ్‌లో ఎన్టీఆర్.. ఎన్ని కోట్ల లాభమంటే?

దేవర చిత్రం మూడో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలబడింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన ఈ సినిమా నిలకడగా వసూళ్లను రాబడుతున్నది. సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను యువ సుధ, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై హీరో నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించారు. ఈ సినిమా గత 20 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

దేవర మూవీని సుమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు బారీ స్పందన లభించింది. దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సుమారుగా 185 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి.దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సుమారుగా 188 నుంచి 190 కోట్ల రూపాయలుగా విలువ కట్టారు. అలా భారీ టార్గెట్‌తో భాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.

Jr NTR Devara Movie 20 days box office collections report here the details

దేవర చిత్రం గత 19 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాలో ఆంధ్రా, నైజాం కలిపి సుమారుగా 210 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత హిందీలో 73 కోట్ల రూపాయలు, కన్నడలో 34 కోట్ల రూపాయలు, తమిళంలో 12 కోట్ల రూపాయలు, కేరళలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా 330 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఉత్తర అమెరికాలోనే సుమారుగా 9 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. మిగితా దేశాల్లోను భారీగా వసూళ్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా 90 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా గత 19 రోజుల్లో 420 కోట్ల రూపాయల నికరంగా.. 500 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Jr NTR Devara Movie 20 days box office collections report here the details

ఇదిలా ఉండగా, 20వ రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. ఈ చిత్రం సుమారుగా ఇండియాలో 2 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ సినిమా 200 కోట్లకుపైగా లాభాన్ని థియేట్రికల్‌గా రాబట్టింది.

ఇక దేవర సినిమా మరో రికార్డు సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం 20 రోజులుగా 1 కోటి రూపాయలకు తగ్గకుండా కలెక్షన్లను రాబట్టడం విశేషంగా మారింది. ఇటీవల కాలంలో ఇలాంటి లాంగ్ బాక్సాఫీస్ రన్‌ను సొంతం చేసుకొన్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కల్కి, స్త్రీ 2 సినిమాల తర్వాత ఆ రేంజ్ కలెక్షన్లు సాధిస్తున్న చిత్రంగా రికార్డు క్రియేట్ చేస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X