Devara 21 Days Collections: రజనీ, గోపిచంద్‌ను మించి ఎన్టీఆర్.. దేవరకు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
పాన్ ఇండియా వైడ్‌గా కొత్త సినిమా రిలీజ్‌లను ఎదుర్కొంటూ బాక్సాఫీస్ వద్ద దేవర చిత్రం భారీ వసూళ్లను సాధిస్తున్నది. కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ స్టామినాకు కొత్త నిర్వచనం చెప్పింది. తొలిసారి అఫీషియల్‌గా పాన్ ఇండియా మూవీతో వచ్చిన యంగ్ టైగర్ ట్రేడ్ నిపుణుల అంచనాలను మించి వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా గత 21 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
శ్రీదేవీ నట వారసురాలు జాన్వీ కపూర్ తొలిసారి తెలుగులో నటించిన చిత్రానికి అనూహ్యమైన స్పందన లభింంచింది. కొరటాల శివ తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిన సినిమా కావడంతో అందరి దృష్టిపడింది. హీరో నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్, యువ సుధ పతాకంపై ఈ సినిమాను సుమారుగా 400 కోట్ల రూపాయలతో నిర్మించారు.

ఓవర్సీస్‌లో ప్రారంభించిన అడ్వాన్స్ బుకింగ్, ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌తో దేవర సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ వచ్చింది. అంతకుముందే పూర్తయిన ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం.. ఈ సినిమా బ్రేక్ టార్గెట్‌గా 185 కోట్ల రూపాయలుగా నిర్ణయించడంతో భారీ లక్ష్యంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తూ సరికొత్త చరిత్రను రాసే ప్రయత్నం చేసింది.
దేవర చిత్రం ఆంధ్రా, నైజాంలో కలిపి సుమారుగా 215 కోట్ల రూపాయలు నికరంగా వసూళ్లను రాబట్టింది. కన్నడలో 35 కోట్ల రూపాయలు, తమిళంలో 12 కోట్ల రూపాయలు, మలయాళంలో 3 కోట్ల రూపాయలు, హిందీ వెర్షన్, ఉత్తరాదిలోని ఇతర ప్రాంతాల్లో ఈ సినిమా 75 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 330 కోట్ల రూపాయలు నికరంగా కలెక్షన్లను రాబట్టింది.
ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ప్రధానంగా ఉత్తర అమెరికా అంటే కెనడా, అమెరికాలో రికార్డు కలెక్షన్లు నమోదు చేసింది. ఈ చిత్రం యూఎస్‌లోనే సుమారుగా 9 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. మిగితా దేశాల్లోను భారీగా వసూళ్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా 90 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

దేవర మూవీ సినిమా గత 20 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ సినిమా 330 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 90 కోట్ల రూపాయలతో సుమారుగా 420 కోట్ల రూపాయలు నికరంగా.. 509 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో అత్యధికంగా కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఇక 21వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ మూవీ నిలకడగా కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం మూడో గురవారం రోజున 1.8 కోట్ల రూపాయలు ఇండియాలో, అలాగే వరల్డ్ వైడ్‌గా 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రజనీకాంత్ నటించిన వేట్టయన్, గోపిచంద్ నటించిన విశ్వం సినిమాల కంటే ఎక్కువగా కలెక్షన్లు రాబట్టడం విశేషంగానే కాకుండా ఎన్టీఆర్ క్రేజ్‌కు అద్దం పట్టింది.


Click it and Unblock the Notifications











