Devara Day 26 Collections: ఎన్టీఆర్ దెబ్బకు బాహుబలి ఔట్.. రూ.334 కోట్లతో రేర్ ఫీట్, 26వ రోజు దేవరకు ఎన్ని కోట్
మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది దేవర . జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన నాటి నుంచి రోజుకు రూ. కోటి తగ్గకుండా షేర్ సాధించిన దేవర నాలుగో వారంలో కాస్తంత డల్ అయ్యాడు. అయినప్పటికీ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్‌లో ఉండటంతో పెద్దగా ఎఫెక్ట్ కనిపించలేదు . ఈ నేపథ్యంలో 26వ రోజు ఎన్టీఆర్ మూవీ ఎన్ని కోట్లు సాధించిందో చూస్తే .
దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. జాన్వీ కపూర్ , సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. దేవర ద్వారా జాన్వీ, సైఫ్‌లు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల శివ టేకప్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో పాటు ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్‌లో రెండో చిత్రం కావడంతో దేవరపై చిత్ర సీమలో భారీ హైప్ నెలకొంది. టీజర్, ట్రైలర్, పాటలతో భారీ బజ్‌ను సొంతం చేసుకున్న దేవర మూవీ.. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది దేవర. దీంతో రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఎన్టీఆర్ బరిలో దిగారు.
ప్రపంచవ్యాప్తంగా 7250 థియేటర్‌లలో రిలీజైన దేవర భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. తొలి రోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా ఎన్టీఆర్ తన ఇమేజ్‌తో సినిమాను నిలబెట్టారు. 25 రోజుల్లో ఊహాకందని విధంగా వసూళ్లను అందుకుని తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తెలుగు వెర్షన్ సినిమాల్లో గ్రాస్ పరంగా ఆర్ఆర్ఆర్, బాహుబలి 2, కల్కి, సలార్ తర్వాతి స్థానంలో దేవర నిలిచింది. గతంలో ఈ స్థానంలో బాహుబలి 1 రూ.332 కోట్లతో ఉండేది.. ఇప్పుడు ఈ రికార్డును దేవర 25 రోజుల్లోనే రూ.334 అందుకోవడం విశేషం. అలాగే ఆంధ్రా ఏరియాలో కల్కి 2898 ఏడీ రికార్డులనే బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. కల్కి ఏపీలో రూ.94.47 కోట్ల షేర్‌ని అందుకుంటే .. దేవర 25 రోజుల్లోనే ఏకంగా రూ.97.50 కోట్ల షేర్‌ని అందుకుని సంచలనం సృష్టించింది.
ఇక 26వ రోజు వసూళ్ల విషయానికి వస్తే దేవర ప్రపంచవ్యాప్తంగా.. రూ. కోటి 80 లక్షల రేంజ్‌లో గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.30 కోట్లు, కర్ణాటక, హిందీ, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకుని రూ. 50 లక్షల కలెక్షన్స్ వచ్చినట్లుగా బాక్సాఫీస్ రిపోర్ట్ చెబుతోంది. మరి 27వ రోజు దేవర ఎన్ని కోట్లు రాబడతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











