Devara Day 3 Collections : బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ మాస్ తాండవం .. మూడో రోజు దేవరకు ఎన్ని కోట్లంటే?
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ నటించిన దేవర మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. డీసెంట్ టాక్ , పాజిటివ్ రివ్యూలతో దేవరకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. తొలి రెండు రోజుల్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన దేవర ఆదివారంతో ముగిసిన తొలి వీకెండ్‌కు ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి పరిశీలిస్తే :
జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ- జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవరకు అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించగా.. శ్రీకాంత్, చాకో, అజయ్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నైజాంలో రూ.44 కోట్లు, సీడెడ్‌లో రూ.22 కోట్లు, ఆంధ్రాలో రూ.46.55 కోట్లు కలిపి మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటకలో రూ.16 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ. కోటి, ఓవర్సీస్‌లో రూ.27 కోట్లు , ఇండియా వైడ్ రూ.20 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ.182.55 కోట్ల బిజినెస్ జరిగింది.

అంచనాలను నిజం చేస్తూ ఫస్ట్ డే ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబట్టింది దేవర. తెలుగులో రూ.82.20 కోట్ల గ్రాస్, రూ.61.65 కోట్ల షేర్ అందుకుంది. తమిళంలో రూ.1.05 కోట్లు, కర్ణాటకలో రూ.6.40 కోట్లు, కేరళలో రూ.25 లక్షలు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ.4.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.24.70 కోట్లు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.98.60 కోట్ల షేర్.. రూ.172 కోట్ల గ్రాస్‌ని దేవర కొల్లగొట్టింది.
రెండో రోజు కూడా దేవర బాగానే హోల్డ్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.16 కోట్లు, మిగిలిన ప్రాంతాల్లో రూ.10 కోట్లు రాబట్టినట్లుగా ఫిలింనగర్ టాక్. మొత్తంగా రూ.110 కోట్ల షేర్‌తో పాటు ఇప్పటి వరకు రూ.220 కోట్ల గ్రాస్‌ను దేవర అందుకుందని ట్రేడ్ వర్గాల అంచనా. దీనికి తగ్గట్టుగానే చిత్ర నిర్మాణ సంస్థలు రెండో రోజు దేవర సాధించిన కలెక్షన్స్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశాయి. ప్రపంచవ్యాప్తంగా దేవర రూ. 243 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాయి.

ఇక మూడో రోజు విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ.27.65 కోట్ల నికర వసూళ్లను సాధించినట్లుగా తెలుస్తోంది. హిందీలో రూ.11 కోట్లు, కర్ణాటకలో రూ.35 లక్షలు, తమిళనాడులో రూ.1.05 కోట్లు, మలయాళంలో రూ.25 లక్షల కలెక్షన్స్ కలుపుకుని ఇండియా వైడ్‌గా రూ.40.30 కోట్ల నికర వసూళ్లను సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తంగా దేవర మూడో రోజు వరల్డ్ వైడ్‌గా రూ.48 కోట్ల వసూళ్లను రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా ఎన్టీఆర్ మూవీ మూడు రోజుల్లో రూ.266 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రూ.300 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది.


Click it and Unblock the Notifications











