Devara 1 AM SHOWS Collections: దేవర ఆల్‌టైం రికార్డు.. రాజమౌళి, ప్రభాస్‌ను బీట్ చేసిన ఎన్టీఆర్
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో సినిమాలు వస్తున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతున్నాయి. అలాంటి వాటిలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' ఒకటి. హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందిన ఈ సినిమాపై ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని రెండు పార్టులుగా తీశారు. అందులో మొదటి దాన్ని శుక్రవారమే (సెప్టెంబర్ 27న) ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఆల్‌టైం రికార్డును నమోదు చేసింది. ఆ వివరాలను మీరే చూడండి!
పాన్ ఇండియా స్థాయికి చేరిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రమే 'దేవర'. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ ఎన్నో అంచనాల నడుమ తాజాగా ఆడియెన్స్ ముందుకు వచ్చేసింది. హైప్‌కు అనుగుణంగానే ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల థియేటర్లలో విడుదల చేశారు. దీంతో అంతటా ఈ సినిమా హడావిడే కనిపిస్తోన్న సంగతి తెలిసిందే.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'దేవర' బెనిఫిట్ షోలను విడుదల రోజు రాత్రి 1 గంటకు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పర్మీషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రెండు రాష్ట్రాల్లోని ప్రధాన నగరంల్లో రాత్రి 1 గంటకే ఈ సినిమా షోలు ప్రదర్శితం అయ్యాయి. అన్ని చోట్లా ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది.
హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందిన 'దేవర' సినిమాకు సంబంధించి రాత్రి 1 గంటకు ప్రదర్శించిన షోల విషయంలో ఫ్యాన్స్ ఉత్సాహాన్ని చూపించారు. మరీ ముఖ్యంగా నైజాం ఏరియాలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువగా రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో రూ. 2.36 కోట్లు గ్రాస్ వసూళ్లు కూడా సొంతం అయ్యాయి.

తెలుగు చిత్ర పరిశ్రమలో గతంలో కూడా చాలా సినిమాలకు రాత్రి 1 గంటకు బెనిఫిట్ షోలు ప్రదర్శితం అయ్యాయి. ఇప్పుడు 'దేవర' ఆ చిత్రాల కలెక్షన్లు మొత్తం దాటేసి ఆల్‌టైం రికార్డును నమోదు చేసింది. ఈ క్రమంలోనే రెబెల్ స్టార్ ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' (రూ. 1.65 కోట్లు), RRR (రూ. 1.48 కోట్లు)లను ఇది బీట్ చేసేసింది. దీంతో ఎన్టీఆర్ రేంజ్ అమాంతం పెరిగింది.
ఇదిలా ఉండగా.. 'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో వచ్చిన 'దేవర' మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను చేశారు. ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మించాయి. దీనికి అనిరుథ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అలాగే, శ్రీకాంత్, చాకో, అజయ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలను పోషించారు.


Click it and Unblock the Notifications











