NTR 30:తమ్ముడి కోసం కళ్యాణ్ రామ్ ఉహించని బడ్జెట్.. ప్లాన్ మామూలుగా లేదుగా!
జూనియర్ ఎన్టీఆర్ మొత్తానికి RRR సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి సాలీడ్ గా అడుగు పెట్టాడు. ఇక తర్వాత సినిమాలతో ఒక బాక్స్ ఆఫీస్ మార్కెట్ ను మరింత క్రియేట్ చేసుకోవాలి అని ఎన్టీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. తన తదుపరి సినిమాను కొరత శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా డిఫరెంట్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సినిమాకు బడ్జెట్ కూడా ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

RRR ఇచ్చిన బూస్ట్ తో..
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద తొమ్మిది వందల కోట్ల కలెక్షన్స్ తో సరికొత్త సంచలనం సృష్టించింది. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ అందుకున్నారు. దీంతో తదుపరి సినిమాను కూడా ఈ సినిమా మంచి బూస్ట్ ఇస్తుంది అనే చెప్పాలి.
ఒక విధంగా RRRకు ముందు RRRకు తర్వాత అనే విధంగా కెరీర్ ను కోమసాగించనున్నట్లు తారక్ ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు.

అదే తరహాలో హిట్ కొట్టాలని..
ఎన్టీఆర్ అయితే ప్రతి సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. RRR సినిమా తో వచ్చిన పాన్ ఇండియా మార్కెట్ ను అదే అదే తరహాలో కాంటిన్యూ చేయాలి అని తారక్ ప్రణాళికలు రచిస్తున్నాడు. ముందుగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఎలాగైనా ఈ సినిమాతో బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలి అని చాలా బలంగా కోరుకుంటున్నాడు.

నిర్మాతగా కళ్యాణ్ రామ్
ఎన్టీఆర్ 30వ సినిమా ను కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ తో పాటు ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంత బరువు కూడా తగ్గినట్లు సమాచారం. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా హైలెట్గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది.

300కోట్లతో?
ఇక ప్రస్తుతం సినిమాకు సంబంధించిన బడ్జెట్ వివరాలపై కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 300 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా గ్రాండ్ ఉండబోతోతున్నట్లు సమాచారం. గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శకుడు కొరటాల సరికొత్త యాక్షన్ విజువల్ ట్రీట్ తో పాటు మంచి సోషల్ మెస్సేజ్ పాయింట్ ను కూడా సినిమాలో హైలెట్ చేయనున్నాడట.
Recommended Video


రిలీజ్ ఎప్పుడంటే?
ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జూన్ మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఇక షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని.. కుదిరితే ఈ ఏడాది చివరి లోపు పూర్తిచేసే వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాను విడుదలకు సిద్ధం చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కుదిరితే అంతకంటే ముందే కూడా సినిమాను విడుదల చేయవచ్చునని టాక్ వస్తోంది. మరి ఆ ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











