Devara Advance Booking: ఓవర్సీస్‌లో దేవర కలెక్షన్ల సునామీ.. రిలీజ్‌కు ముందే ఎన్టీఆర్ మూవీ రికార్డు

కొరటాల శివ- జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ దేవర. జనతా గ్యారేజ్‌ తర్వాత ఎన్టీఆర్- కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ద్వారా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌లు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషిస్తుండగా.. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అనిరుధ్ స్వరాలు అందిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 27న దేవర పార్ట్ -1 ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్‌కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దేవర దుమ్మురేపుతోంది.

ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఎన్టీఆర్ తన క్యారెక్టర్‌‌ వరకు షూటింగ్‌ను రీసెంట్‌గానే పూర్తి చేసుకుని రెస్ట్ తీసుకుంటున్నారు. ఇటీవలే తన తల్లి షాలిని, భార్య ప్రణీతతో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించిన ఆయన హైదరాబాద్‌కు తిరిగొచ్చారు.

Jr NTR koratala siva s Devara Crossed Million Dollar Mark with Pre-Sales in NorthAmerica here s the details

అయితే సెప్టెంబర్ 10న దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరగనుంది. ఆ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగానే జూనియర్ అక్కడికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 10 బాలీవుడ్ మీడియాతో ఎన్టీఆర్ - కొరటాల మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ చేతికి గాయమైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తన చేతికి ఉన్న కట్టును తీసేశారు. ముంబైలో దిగిన తర్వాత బయటికొచ్చిన ఎన్టీఆర్ ఫోటోల్లో ఆ కట్టు కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

ఇక దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ట్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే దేవర రూ.125 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. నైజాంలో రూ.45 కోట్లు, ఆంధ్రాలో రూ.55 కోట్లు, సీడెడ్‌లో రూ.25 కోట్లు వ్యాపారం జరిగినట్లు వినికిడి. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ.200 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నాన్ థియేట్రికల్ బిజినెస్ సంగతి చూస్తే.. దేవర డిజిటల్ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.155 కోట్లకు దక్కించుకున్నట్లుగా సమాచారం. శాటిలైట్ రైట్స్ రూ.75 కోట్లకు, ఆడియో రైట్స్ రూ.33 కోట్లకు అమ్ముడైనట్లు ఫిలింనగర్ టాక్. అంటే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం కలుపుకుని దేవర దాదాపు రూ.450 కోట్లకు పైనే బిజినెస్ చేసిందని అంటున్నారు.

సెప్టెంబర్ 27న దేవర రిలీజ్‌ నేపథ్యంలో ఇప్పటికే ఓవర్సీస్‌లోని కొన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇక ప్రీ సేల్‌లోనూ ఎన్టీఆర్ మూవీ సత్తా చాటుతోంది. రెండ్రోజుల క్రితమే 5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లుగా చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. దీనిని కంటిన్యూ చేస్తూ నార్త్ అమెరికాలో దేవర ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రీ సేల్స్‌ కలెక్షన్స్‌లో 1 మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసింది.

Jr NTR koratala siva s Devara Crossed Million Dollar Mark with Pre-Sales in NorthAmerica here s the details

తద్వారా అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా దేవర చరిత్ర సృష్టించింది. అలాగే ఎన్టీఆర్ కెరీర్‌లో 1 మిలియన్ డాలర్ల మార్క్‌‌ను దాటిన 8వ చిత్రంగా దేవర నిలిచినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రిలీజ్‌కు ఇంకా రెండు వారాలకు పైగా సమయం ఉండటంతో ఈ లోపు దేవర ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడోనని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Read more about: jr ntr koratala siva devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X