Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బిజినెస్ పరంగా ఎన్టీఆర్ 'రచ్చ' సంచలనం నిజమేనా?
ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో రూపొందుతున్న రచ్చ చిత్రం ఓపినింగ్ రోజే నాలుగు ఏరియాలకు ఆల్రెడి అడ్వాన్స్ లు ఇచ్చేసారని తొమ్మిది కోట్ల రూపాయల వరకూ బిజినిస్ జరిగింది. ఓవర్ సీస్ రైట్స్ ని రెండు కోట్ల పది లక్షలకు హరి వెంకటేశ్వరరావు అనే డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నాడు. అలాగే వెంకట్ గరికపాటి, హరి కలిసి నెల్లూరు, గుంటూరు, కృష్ణా ఏరియాల రైట్స్ ఏడు కోట్లకు తీసుకున్నారని చెప్తున్నారు. నందమూరి వంశాభిమానలైన వీరు బాలకృష్ణ సింహా చిత్రాన్ని తీసుకుని గుంటూరు, కృష్ణ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసి లాభాలు గడించారు.
అయితే ఈ ట్రేడ్ లో చెప్పుతున్న లెక్కలు మాత్రం కావాలని ప్రాజెక్టుకు క్రేజ్ తీసుకురావటానికి ఉద్దేశించినవేనని ఓ వర్గం ఆరోపిస్తోంది. ఇంతకుముందు ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన అశోక్ పెద్దగా ఆడకపోయినా, కిక్ వంటి విజయం ఇచ్చిన దర్శకుడు కావటంతో ఈ సినిమాపై మంచి హోప్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ నుండి ప్రేక్షకులు, అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉంటూనే సరికొత్త టైప్ లో సాగే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది అని ఈ చిత్రం గురించి దర్శకుడు సురేంద్రరెడ్డి చెప్తున్నారు. ఎన్టీఆర్ సరసన తమన్నా ఓ హీరోయిన్. మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రాన్ని చత్రపతి నిర్మించిన బి.వి.ఎస్.ఎం. ప్రసాద్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభించి జనవరి 8 నుండి ఏకధాటిగా షేడ్యూల్ చేస్తారు.
ఎన్టీఅర్, తమన్నా, కిక్ శ్యాం, ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్ధి, అలీ, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, వేణు మాధవ్, ఎమ్.ఎస్. నారాయణ, దువ్వాసి మోహన్, రఘు కారుమంచి, వెనకట్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కధ...వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రసూల్ ఎల్లూర్, పాటలు: చంద్రబోస్, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: కోటగిరి విద్యాధరరావు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, స్క్రీన్-ప్లే, దర్శకత్వం:సురేందర్ రెడ్డి.