twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్నయ్య కోసం జూనియర్ ఎన్టీఆర్ 40కోట్ల త్యాగం.. ఇదే బెస్ట్ డీల్?

    |

    జూనియర్ ఎన్టీఆర్ న్యూ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నడు. RRR సినిమా విడుదల తరువాత మరొక సినిమాను వెంటనే స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. కానీ ఆ సినిమా కరోనా కారణంగా వాయిదా పడడంతో తారక్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు. ఇక తన 30వ సినిమా విషయంలో ఎన్టీఆర్ ఇటీవల ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా రెమ్యునరేషన్ విషయంలో తారక్ మొదటిసారి ఒక ఫార్ములా వాడుతున్నట్లు తెలుస్తోంది.

    ఎన్టీఆర్ అప్సెట్

    ఎన్టీఆర్ అప్సెట్

    జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటించిన మొదటి సినిమా సమ్మర్ కు షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావల్సిన ఆ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. నెలరోజుల పాటు నిర్విరామంగా ప్రమోషన్స్ చేసిక చిత్ర యూనిట్ సభ్యులు సినిమాను వాయిదా వేయగానే ఒక్కసారి సైలెంట్ అయ్యారు. ఎన్టీఆర్ కూడా RRR వాయిదా పడగానే ఒక్కసారిగా అప్సెట్ అయ్యాడు.

     కొరటాల ప్రాజెక్ట్

    కొరటాల ప్రాజెక్ట్

    ఇక కొన్ని రోజుల పాటు చాలా సైలెంట్ గానే ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇక భవిష్యత్తు ప్రాజెక్టులపై ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాడు. ఇటీవల కొరటాల శివకు సంబంధించిన ప్రాజెక్టును మొదలు పెట్టాలని ప్లాన్ కూడా సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ ఆ ప్రాజెక్టును నిర్మించనున్న విషయం తెలిసిందే.

     లాంచ్ డేట్ ఫిక్స్

    లాంచ్ డేట్ ఫిక్స్

    ఇక త్వరలోనే ఎన్టీఆర్ 30వ సినిమాను లాంచ్ చేయాలని అనుకుంటున్నాడు. దర్శకుడు కొరటాల శివ కూడా పూర్తి స్క్రిప్ట్ పనులను ఎప్పుడు పూర్తి చేశాడు. ఇక ఫిబ్రవరి 7వ తేదీన సినిమాలో అధికారికంగా లాంచ్ చేయాలని అనుకుంటున్నాను. అసలైతే ఈ సినిమాను త్రిబుల్ ఆర్ సినిమా విడుదల తర్వాతే మొదలు పెట్టాలని అనుకున్నాడు. కానీ ఇప్పట్లో ఆ సినిమా విడుదలయ్యే అవకాశం లేదు అనే ఆ ప్రాజెక్టును మొదలు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నాడు.

    మ్యూజిక్ డైరెక్టట్ ఎవరు?

    మ్యూజిక్ డైరెక్టట్ ఎవరు?

    ప్రస్తుతం ఎన్టీఆర్ 30వ సినిమా కు సంబంధించిన అనేక రకాల విషయాల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ఫిక్స్ అయినట్లుగా సోషల్ మీడియాలో ఒక టాక్ అయితే వైరల్ అవుతుంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కోసం దేవిశ్రీ ప్రసాద్ ను కాదని ఆచార్య కోసం మణిశర్మను తీసుకున్న కొరటాల శివ ఇప్పుడు అభిమానుల కోరిక మేరకు అనిరుద్ ను తీసుకుంటాడా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

     రెమ్యునరేషన్ త్యాగం?

    రెమ్యునరేషన్ త్యాగం?

    ఇక ఎన్టీఆర్ 30వ సినిమాకు పారితోషికం ఎంత తీసుకుంటున్నాడు అనేది కూడా ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. తన సొంత సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ సినిమా నిర్మిస్తూ ఉండడంతో ఎన్టీఆర్ ముందుగా పారితోషకం తీసుకోవడం లేదట. ప్రస్తుత మార్కెట్ ప్రకారం అయితే 40 కోట్లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అంటిఆర్ అలా కాకుండా తన అన్న కోసం సినిమా సక్సెస్ అయిన తర్వాత లాభాల్లో వాటా తీసుకునే విధంగా డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

    Recommended Video

    Jr NTR వదులుకున్న Blockbusters | Happy Birthday NTR || Filmibeat Telugu
     ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి..

    ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి..


    ఎన్టీఆర్ ఇదివరకే కళ్యాణ్ రామ్ తో జై లవకుశ అనే సినిమా కూడా చేశాడు. కానీ ఆ సినిమా అంచనాలకు తగ్గట్టుగా అయితే సక్సెస్ కాలేదు. అందుకే ఆ తర్వాత అన్నతో ఎలాగైనా మరొక మంచి సినిమా చేయాలని ఎన్టీఆర్ అనుకున్నాడు. మొదట త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని కాంబినేషన్లో ఎన్టీఆర్ సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి ఆలోచించే కొరటాల శివ ప్రాజెక్టు లైన్ లోకి తీసుకు వచ్చాడు. ఇక వచ్చే ఏడాది మొదట్లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    English summary
    Rajasekhar special role in jr ntr koratala siva project,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X