హాట్ టాపిక్ : ఎన్టీఆర్ ‘బాద్ షా’బిజినెస్
హైదరాబాద్ : శ్రీను వైట్ల దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'బాద్ షా'. బిజినెస్ వర్గాల్లో ఈ చిత్రం సంచలనం క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి భారీ ఆఫర్స్ ఇస్తూ చాలా మంది ఎగబడుతున్నారని ట్రేడ్ టాక్. ఎన్టీఆర్ సినిమాల్లో హైయిస్ట్ ప్రీ రిలీజ్ చేసే చిత్రంగా ఈ చిత్రం రికార్డు ఎక్కనుంది. ఓవర్ సీస్ లో సైతం ఈ చిత్రం నాలుగున్నరనుంచి ఐదు కోట్లు వరకూ పలుకుతోందని తెలుస్తోంది. ఇక సీడెడ్ లో అయితే ఎనిమిది కోట్ల వరకూ ఇవ్వటానికి రెడీ అవుతున్నారు.
నైజాం లో కూడా పదికోట్లకు పైగా పలుకుతోంది. విడుదలకు ముందు అన్ని రైట్స్ కలిపి యాభై కోట్ల వరకూ బిడినెస్ చేస్తోందని చెప్పుకుంటున్నారు. అయితే బండ్ల గణేష్ మాత్రం ఆచి తూచి బిజినెస్ విషయంలో అడుగులు వేస్తున్నారు. ఈ చిత్రానికి సంభందించి శాటిలైట్ రైట్స్ ఫైనల్ అయ్యాయని తెలుస్తోంది. అయితే ఓ ధర్డ్ ఫార్టీ ఈ రైట్స్ ని కొనుగోలు చేసిందని సమాచారం. ఆ రేటు ఏడు కోట్ల యాభై లక్షలు పలికిందని తెలుస్తోంది. ధర్డ్ పార్టీ వారు తర్వాత మరో రేటుకు టీవీ ఛానెల్స్ కు అమ్ముకుంటారు. ఇప్పటికే ఈ చిత్రం హక్కులు దక్కించుకునేందుకు రెండు పాపులర్ టీవీ ఛానల్స్ పోటీ పడుతున్నాయి. దాంతో మధ్యరకంగా ఈ రేటుకి ఫిక్స్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ ''ఎన్టీఆర్ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలూ రంగరించిన కథ ఇది. ఆయన నటన, గెటప్స్ ఆకట్టుకొంటాయి. హీరోయిజాన్ని పతాక స్థాయిలో చూపిస్తున్నారు దర్శకుడు. ఇటీవలే విదేశాల్లో పోరాట ఘట్టాల్నీ, సన్నివేశాల్ని చిత్రించాుర. అవి చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి'' అన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పాత్ర గురించి చెబుతూ నిర్మాత బండ్ల గణేష్...సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్‌లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్‌లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్‌షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్.
కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగనుంది. ఎన్టీఆర్ పూర్తి కాన్పిడెంట్ గా హిట్ కొడతానని చెప్తున్న ఈ చిత్రం టీజర్ ని క్రిందటి నెల 24న 'బాద్‌షా' విడుదల చేసారు. టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'బాద్ షా' నాన్ స్టాప్‌గా డిసెంబర్ వరకు జరిగే షూటింగుతో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. డిసెంబర్ కల్లా షూటింగ్ పార్టు పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి. అదే నెలలో ఆడియో విడుదల కానుంది.
'బాద్ షా' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











