Devara Day 4 Collections: నాలుగో రోజూ దారుణంగా పడిపోయిన దేవర కలెక్షన్స్.. ఇప్పటి వరకు ఎన్ని కోట్లంటే?

Devara Day 4 Collections : యంగ్ టైగర్ జూనియర్ - సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన మూవీ 'దేవర'. ఈ మూవీ భారీ అంచనాలతో సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరేండ్ల తరువాత తారక్ సోలో హీరోగా వస్తుండటంతో ఫ్యాన్స్ అంచనాలు ఆకాశానికి అంటాయి. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ డీసెంట్ టాక్ , పాజిటివ్ రివ్యూలతో దేవరకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. తొలి రెండు రోజుల్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన దేవర మరి నాలుగవ రోజు ఎంత కలెక్ట్ సాధించిందో ఓ లూక్కేద్దామా..

సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ' దేవర ' మానియా కొనసాగుతోంది. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. జనతా గ్యారేజ్‌తో ఎన్టీఆర్‌కు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందించిన కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తుండటంతో గతంలో తారక్ ఏ సినిమాకు రానంత బజ్‌ దేవరకు క్రియేట్‌ అయింది. అలాంటి అంచనాలకు తగ్గట్టుగానే..కొరటాల శివ దర్శకత్వంలో దేవర హై ఓల్టేజ్​ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ను ఎలివేట్ చేస్తూ.. ఇచ్చిన అనిరుధ్ ఇచ్చిన బీజీఎం, మ్యూజిక్ సినిమాకు మరో ప్లస్ పాయింట్..

మాస్ అండ్ యాక్షన్ మూవీలో ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ నటులు నటించడం, డైరెక్టర్ కొరటాల డైరెక్షన్, ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ మూవీలో ఎన్టీఆర్ డూయల్ రోల్ లో నటించి తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఈ సినిమాకి తొలిరోజు మిక్స్‌డ్‌ రివ్యూలను అందుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే భారీ వసూళ్లతో టాప్ గా నిలిచింది. అంచనాలను నిజం చేస్తూ ఫస్ట్ డే ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబట్టింది దేవర. తెలుగులో రూ.82.20 కోట్లు, తమిళంలో రూ.1.05 కోట్లు, కర్ణాటకలో రూ.6.40 కోట్లు, కేరళలో రూ.25 లక్షలు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ.4.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.24.70 కోట్లు ఇవన్నీ కలుపుకుని వైల్డ్ వైడ్ గా తొలి రోజే దాదాపు రూ.172 కోట్ల వసూలు రాబట్టింది.

రెండో రోజు కూడా దేవర కలెక్షన్లు బాగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.16 కోట్లు, మిగిలిన ప్రాంతాల్లో రూ.10 కోట్లు రాబట్టినట్లుగా ఇండస్ట్రీ టాక్. మొత్తంగా రూ.110 కోట్ల షేర్‌తో పాటు ఇప్పటి వరకు రూ.220 కోట్ల గ్రాస్‌ను అందుకున్నట్టు తెలుస్తోంది.దీనికి తగ్గట్టుగానే చిత్ర నిర్మాణ సంస్థలు రెండో రోజు దేవర సాధించిన కలెక్షన్స్‌పై అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ చేశాయి. ఇక మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.27.65 కోట్ల వసూళ్లను సాధించగా.. హిందీలో రూ.11 కోట్లు, కర్ణాటకలో రూ.35 లక్షలు, తమిళనాడులో రూ.1.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. తద్వారా ఎన్టీఆర్ మూవీ మూడు రోజుల్లో రూ.266 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రూ.300 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది.

jr ntr s devara movie 4 days box office collections report here s the details
దేవర తొలిరోజు బాక్సాఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్ సాధించింది. కానీ, నాలుగవ రోజు కలెక్షన్లు ఘోరాతి ఘోరంగా పడిపోయాయి.సండే తో పోల్చితే.. నియర్లీ దాదాపు 70-75 శాతం టికెట్ సేల్స్ డ్రాప్ అయ్యాయి. అలాగే.. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పరంగా కూడా డ్రాప్స్ కనిపించింది. ఈవినింగ్ అండ్ నైట్ షోల పరంగా కొంచెం గ్రోత్ కనిపించింది. ఓవరాల్ గా ప్రస్తుతం ట్రెండ్ ను బట్టి మొత్తం మీద...4.5-5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా.. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ప్రకారం దాదాపు 5.5 కోట్ల వచ్చాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన సమాచారం ప్రకారం. జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమా తొలి సోమ‌వారం ఇండియాలో కేవలం రూ.7.96 కోట్ల రూపాయ‌లు మాత్రమే రాబ‌ట్టింది. ఒక్కవేళ నైట్ ట్రేడ్ బాగుంటే.. 9 నుంచి 10 కోట్ల దాకా వెళ్లవచ్చు అయితే..ఇవి కేవలం సినిమా అంచనా గణాంకాలు మాత్రమే.

More from Filmibeat

Read more about: devara collections jr ntr devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X