అయ్యో పాపం....‘రభస’ పరిస్థితి అలా ఉందేంటి?
హైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రభస' చిత్రం గణేష్ చతుర్థి సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇటీవలే సెన్సార్ బోర్డు నుండి 'A' సర్టిఫికెట్ పొందిన రభసను ఆగస్టు 29న విడుదల చేసేందుకు గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నారు.
కేవలం ఆంధ్ర, తెలంగాణలలో మాత్రమే కాదు....అమెరికాలోనూ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఎన్టీఆర్ గత సినిమాలు 'బాద్ షా', 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాలతో పోలిస్తే అమెరికాలో 'రభస' చిత్రం విడుదల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ రెండు సినిమాల కంటే తక్కువ స్క్రీన్లలోనే 'రభస' చిత్రం విడుదలవుతోంది.

గతంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ నటించిన 'బాద్ షా' చిత్రం అమెరికాలో 108 స్క్రీన్లలో విడుదల చేసారు. ఆ తర్వాత వచ్చిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం 115కు పైగా స్క్రీన్లలో విడుదల విడుదల పరంగా 'బాద్ షా' రికార్డును బద్దలు కొట్టింది. అయితే రభస చిత్రం ఈ రెండు చిత్రాల కంటే ఎక్కువ స్క్రీన్లలో విడుదలవుతుందని ఊహించిన అభిమానులకు చుక్కెదురైంది. కేవలం 90 సెంటర్లలో మాత్రమే 'రభస' చిత్రం విడుదలవుతోంది.
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న 'రభస' చిత్రం యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టెనర్. శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ సమర్పణలో ఆయన కొడుకు బెల్లంకొండ గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. బ్రహ్మానందం, జయసుధ, నాజర్, అలీ, షాయాజీ షిండే, బ్రహ్మాజీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











