Simhadri 4K Collections.. జూ.ఎన్టీఆర్ సింహాద్రికి భారీ ఓపెనింగ్స్.. ఆస్ట్రేలియా, జపాన్, యూఎస్ఏలో భారీగా!
సెన్సేషనల్ డైరెక్టర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన సింహాద్రి సినిమా సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం ఎన్టీఆర్‌కు స్టార్ స్టేటస్ తీసుకు రావడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించే హీరోను ఎస్టాబ్లిష్ చేసింది. అలాంటి సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ బర్త్ డేను పురస్కరించుకొని మే 20 తేదీన ప్రపంచవ్యాప్తంగా 4K వెర్షన్‌ను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
లేటేస్ట్ టెక్నాలజీతో సింహాద్రి:సింహాద్రి సినిమా 4K వెర్షన్‌ను భారీ రేంజ్‌లో రిలీజ్ చేసేందుకు అభిమానులు ఏర్పాట్లు చేశారు. ఈ సినిమాను అత్యాధునిక టెక్నాలజితో 4K వెర్షన్‌తోపాటు 5.1 సౌండ్ సిస్టమ్‌తో సిద్దం చేశారు. అంతేకాకుండా ఈ సినిమాను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో చూపించేందుకు ప్లాన్ చేశారు. నేటి జనరేషన్ టేస్ట్‌కు తగినట్టుగా మంచి క్వాలిటీతో సినిమాను సిద్దం చేశారు.

అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లో:సింహాద్రి సినిమాను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. మే 20 తేదీన జపాన్‌లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్‌కు భారీగా అభిమానులు పెరిగిపోవడంతో సింహాద్రి సినిమాను రిలీజ్ చేస్తూ అక్కడి అభిమానులను ఆకట్టుకొనేందుకు ప్లాన్ చేస్తున్నారు.

హైదరాబాద్‌లో ఓపెనింగ్స్:హైదరాబాద్‌లో సింహాద్రి సినిమాకు మంచి రెస్పాన్స్ కనిపిస్తున్నది. ఈ సినిమాను హైదరాబాద్‌లో 24 షోలు ప్రదర్శించేందుకు ప్లాన్ చేశారు. ఇప్పటికే 9 షోలకు హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. మరో 9 షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతున్నాయి. మొత్తం 24 వేల టికెట్లకు గాను.. 19 వేలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయి. దాదాపు 80 శాతం ఆక్యుపెన్సీతో 25 లక్షలు వసూలు చేసింది.

అమెరికాలో ప్రీమియర్లకు.. :అమెరికాలో సింహాద్రి రీ రిలీజ్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. మే 19వ తేదీన ప్రదర్శించే ప్రీమియర్లకు మంచి ఆదరణ కనిపించింది. ఈ సినిమాను 63 లొకేషన్లలో ప్రదర్శిస్తున్నారు. మొత్తం 117 షోలు ప్లాన్ చేశారు. ఇప్పటికే 10 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. దాదాపు 10 వేల డాలర్లు కలెక్ట్ అయ్యాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

ఆస్ట్రేలియాలో తొలి రోజు కలెక్షన్లు:ఆస్ట్రేలియాలో సింహాద్రి సినిమాను భారీగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సినిమాను ఐమాక్స్‌లో అట్టహాసంగా రి రీలీజ్ చేశారు. ఐమాక్స్ అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. దాదాపు 5 వేల డాలర్లను ఇప్పటికే వసూలు చేసింది. ఇతర చైన్ థియేటర్ల అడ్వాన్స్ బుకింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానున్నది.


Click it and Unblock the Notifications











