ఎన్టీఆర్ 'శక్తి' కి ప్రస్తుతానికి ఆ రెండు రికార్డులు
జూ ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న చిత్రం శక్తి. ఈ చిత్రం బడ్జెట్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రికార్డు అని తెలుస్తోంది. ఆ బడ్జెట్ ఎంత అంటే నలభై అయిదు కోట్లు అని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రం ఎక్కువ లొకేషన్స్ లో షూట్ చేసిన చిత్రంగా కూడా రికార్డు క్రియోట్ చేయనుందని తెలుస్తోంది. ఇక ఎక్కువ ధియోటర్స్ లో రిలీజ్ చేయటం అనే రికార్డు ని క్రియోట్ చేసేఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. వీటితో పాటు కలెక్షన్స్ లో రికార్డు క్రియోట్ చేస్తుందని యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు.ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఇలియానా నటించింది.
కంత్రి తరువాత ఎన్టీఆర్, మెహర్ రమేష్, సి.అశ్వనీదత్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఇది. అలాగే ఇంతవరకూ ఎన్టీఆర్ చేయని ఓ వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం తయారవుతోందని చెప్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ గెటప్, పాత్ర చిత్రణ, సంభాషణలు...క్లాస్ నీ, మాస్ నీ ఆకట్టుకునే విధంగా ఉంటాయని దర్శకుడు చెబుతున్నారు. 'రాఖీ' తరువాత ఎన్టీఆర్ సరసన ఇలియానా నటిస్తున్న సినిమా ఇదే. మణిశర్మ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, కెమెరా: సమీర్‌రెడ్డి, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్, రచనా సహకారం: యండమూరి వీరేంద్రనాథ్, జె.కె.భారవి, తోట ప్రసాద్, డి.ఎస్.కన్నన్, పాటలు: వేటూరి, సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి.


Click it and Unblock the Notifications











