Devara 2 Days Collections: కుమ్మిపడేసిన ఎన్టీఆర్.. ఇటు 100 అటు 200 ఔట్.. దేవర 2 రోజుల రిపోర్టు ఇదే!
టాలీవుడ్ రేంజ్ గతంలో కంటే ఇప్పుడు పెరిగింది. అలాగే, ఇక్కడి హీరోల స్థాయి కూడా పాన్ ఇండియాకు చేరుకుంది. ఇలా చాలా మంది ఈ మధ్యన భారీ చిత్రాలతో సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. వరుసగా హిట్లు కొడుతూ ఫామ్‌లో ఉన్న అతడు తాజాగా నటించిన సినిమానే 'దేవర'. హై యాక్షన్‌తో రూపొందిన ఈ సినిమాకు టాక్‌తో సంబంధం లేకుండా భారీ రెస్పాన్స్ లభిస్తోంది. ఇలా ఈ సినిమా అదిరిపోయే వసూళ్లను సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ 'దేవర' 2 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూసేయండి!
ఫుల్లు యాక్షన్‌తో దేవర రాక
ఎన్టీఆర్ హీరోగా నటించిన ఫుల్ యాక్షన్ మూవీనే 'దేవర'. కొరటాల శివ తీసిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను చేశారు. ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మించాయి. అలాగే, శ్రీకాంత్, చాకో, అజయ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుథ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

దేవరకు బిజినెస్ ఎంతంటే
ఎన్టీఆర్ నటించిన 'దేవర'కు నైజాంలో రూ. 44 కోట్లు, సీడెడ్‌లో రూ. 22 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 46.55 కోట్లతో కలిపి తెలుగులో రూ. 112.55 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 16 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 20 కోట్లు, కేరళలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 27 కోట్లతో కలిపి రూ. 182.55 కోట్లు వ్యాపారం జరిగింది.

2వ రోజు ఇలా.. మొత్తంగా
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' సినిమాకు మొదటి రోజు భారీ రెస్పాన్స్ వచ్చింది. 2వ రోజు కూడా ఇది బాగానే హోల్డ్ చేయగలిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 16 కోట్లు షేర్ వసూలు చేసింది. మిగిలిన ప్రాంతాల్లో మరో రూ. 10 కోట్లు రాబట్టింది. ఇలా రెండో రోజు రూ. 26 కోట్లు షేర్ వసూలు చేసుకుంది. దీంతో మొత్తంగా రూ. 110 కోట్లు షేర్‌తో పాటు రూ. 220 కోట్లు గ్రాస్ రాబట్టింది.


Click it and Unblock the Notifications











