Devara: ఎన్టీఆర్ శివతాండవం.. ఒక్కరోజులోనే ఆల్‌టైం రికార్డు.. టాలీవుడ్‌లో తొలి సినిమాగా దేవర సంచలనం
దేవర.. దేవర.. దేవర.. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అవుతోన్న సినిమాల్లో ఇది ఒకటి. అంతలా ఈ మూవీ ఆరంభంలోనే హైప్‌ను క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత దీన్ని రెట్టింపు చేసుకుంటూ పాన్ ఇండియా రేంజ్‌లో హైలైట్ అయింది. ఇలా ఎన్నో అంచనాలతో శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ చిత్రానికి అనుకున్న విధంగా పాజిటివ్ టాక్ అయితే రాలేదు. కానీ, రెస్పాన్స్ మాత్రం ఫస్ట్ డే భారీగా లభించింది. ఈ నేపథ్యంలో 'దేవర' మూవీ సినిమా అడ్డాలో ఆల్‌టైం రికార్డును నమోదు చేసింది. ఆ వివరాలేంటో మీరే చూసేయండి!
దేవరగా ఎన్టీఆర్ తాండవం
ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే 'దేవర'. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను చేశారు. ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి అనిరుథ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అలాగే, శ్రీకాంత్, చాకో, అజయ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.

టాక్‌తో సంబంధం లేకుండా
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' మూవీ భారీ అంచనాలతో శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాక్ వచ్చింది. కానీ, దీనికి సంబంధం లేకుండా రెస్పాన్స్ మాత్రం భారీ స్థాయిలో వచ్చింది. దీంతో ఈ సినిమా అనుకున్న దానికంటే అన్ని భాషలు, ప్రాంతాల్లో రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు సాధించింది.
ఒక్క రోజులోనే అన్ని కోట్లతో
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా స్పందన భారీగా దక్కడంతో కలెక్షన్లు కూడా అదే రీతిలో పోటెత్తాయి. దీంతో ఈ సినిమా మొదటి రోజే దాదాపు రూ. 70 కోట్లు షేర్‌తో పాటు రూ. 172 కోట్లు గ్రాస్ మార్కును చేరుకుంది. తద్వారా టాలీవుడ్ హిస్టరీలోనే సెకెండ్ బెస్ట్ ఓపెనింగ్స్‌తో సంచలన రికార్డు నమోదు చేసింది.

హైదరాబాద్‌లో భారీ షోలు
'దేవర' మూవీ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదలైంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఇది ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అంతేకాదు, హైదరాబాద్‌లో ఈ చిత్రానికి స్పెషల్ షోలతో కలిపి మొత్తంగా ఆరు పడ్డాయి. ఇలా ఒక్క నగరంలోనే ఈ చిత్రం వేయికి పైగా షోలు ప్రదర్శితం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన కొద్ది చిత్రాల్లో స్థానం సాధించింది.

క్రాస్ రోడ్స్‌లో సంచలనం
నైజాం ఏరియాలో అత్యంత ముఖ్యమైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో 'దేవర' మొదటి రోజే భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. తద్వారా ఈ మూవీ ఏకంగా రూ. 1.17 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసి సత్తా చాటింది. ఈ క్రమంలోనే 'గుంటూరు కారం' మూవీ పేరిట ఉన్న రూ. 86.85 లక్షల రికార్డును ఇది బ్రేక్ చేసేసి ఆల్‌టైం టాప్ మూవీగా ఘనతను సొంతం చేసుకుంది.

ఆ తర్వాత స్థానాల్లో ఇవే
సినిమా అడ్డాగా పేరొందిన ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' మూవీ టాప్ ప్లేస్‌కు చేరుకోగా.. 'గుంటూరు కారం' రెండో స్థానంలో, RRR రూ. 75.85 లక్షలతో మూడో స్థానానికి పడిపోయింది. అలాగే, ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ రూ. 57 లక్షలతో నాలుగో స్థానంలో, 'సర్కారు వారి పాట' రూ. 54.23 లక్షలతో ఐదో స్థానంలో నిలిచాయి.


Click it and Unblock the Notifications











