Devara USA Collections: అమెరికా గడ్డపై ఎన్టీఆర్ మరో రికార్డు.. గొప్ప చిత్రాలను దాటేసిన దేవర

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సినీ ప్రియులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఈ బడా హీరో సుదీర్ఘ కాలంగా తనదైన నటనతో పాటు ఆల్‌రౌండ్ షోతో అలరిస్తున్నాడు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తారక్ వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు. ఈ ఊపులోనే ఇప్పుడు ఈ స్టార్ హీరో 'దేవర' అనే సినిమాలో నటించాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తాజాగా అమెరికాలో అదిరిపోయే రికార్డును నమోదు చేసుకుంది. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

దేవరగా ఎన్టీఆర్ అరాచకం
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన యాక్షన్ మూవీనే 'దేవర'. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. దీనికి అనిరుథ్ సంగీతం అందించాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించాడు. ఇందులో శ్రీకాంత్, చాకోలు కీలక పాత్రల్లో నటించారు.

Jr NTR Starrer Devara Movie Crossed 2 8 Million Mark In USA Premiere Advance Sales

ఎన్టీఆర్ మేనియాతో రచ్చ

దాదాపు ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన సోలో హీరో సినిమా 'దేవర'ను యాక్షన్ స్టోరీతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 27న అంటే ఈరోజే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్‌గా చాలా ఏరియాల్లో ఈ సినిమా మేనియానే కనిపిస్తోంది. ఫలితంగా దేవర పేరు మారుమ్రోగిపోతోంది.

అక్కడ ఫుల్లు రెస్పాన్స్‌తో
కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందిన 'దేవర' మూవీకి సంబంధించి ముందుగా ఓవర్సీస్‌లోనే టికెట్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. అలా అక్కడ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వస్తోంది. దీంతో అప్పుడే కలెక్షన్లను కూడా భారీగానే వసూలు చేసింది. తద్వారా వేగంగా 1 మిలియన్, 2 మిలియన్లు మార్కును దాటిన చిత్రాల లిస్టులో ఇది చేరిపోయింది.

Jr NTR Starrer Devara Movie Crossed 2 8 Million Mark In USA Premiere Advance Sales

ప్రీమియర్స్‌తోనే అంతా

పాన్ ఇండియా స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' మూవీకి సంబంధించి యూఎస్‌లో అడ్వాన్స్ సేల్స్ భారీ స్థాయిలో సాగుతున్నాయి. అక్కడ ఎవరూ ఊహించని రీతిలో దీనికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇలా ఈ సినిమా అక్కడ అప్పుడే 2.8 మిలియన్ డాలర్ల మార్కును కూడా చేరుకుంది. ఈ విషయాన్ని డిస్ట్రిబ్యూటర్లు అధికారికంగా ప్రకటించారు.

టాలీవుడ్‌లో మూడోదిగా
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' సినిమాకు నార్త్ అమెరికాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. తద్వారా ఇది ప్రీమియర్స్ ద్వారానే 2.8 మిలియన్ డాలర్లను సాధించింది. తద్వారా టాలీవుడ్‌లో అత్యధిక ప్రీమియర్ కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో కల్కి 2898 ఏడీ (3.9 మిలియన్లు), RRR (3.46 మిలియన్లు) తర్వాత స్థానానికి చేరుకుంది.

Jr NTR Starrer Devara Movie Crossed 2 8 Million Mark In USA Premiere Advance Sales

వాళ్ల రికార్డులన్నీ వెనక్కే

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' సినిమాకు నార్త్ అమెరికాలో అద్భుతమైన స్పందన వస్తోంది. ఫలితంగా ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారానే 2.8 మిలియన్ డాలర్ల మార్కును చేరింది. ఈ క్రమంలోనే ప్రభాస్ 'సలార్', 'బాహుబలి 2', పవన్ 'అజ్ఞాతవాసి', మహేశ్ బాబు 'గుంటూరు కారం', ప్రభాస్ 'బాహుబలి 1' రికార్డులను కూడా ఈ చిత్రం దాటింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X