Devara USA Collections: పరాయి దేశంలో దేవర సెన్సేషన్.. పవన్, ప్రభాస్, మహేశ్‌ను దాటేసిన ఎన్టీఆర్

తెలుగు సినిమా పరిశ్రమలోకి బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా.. తనదైన టాలెంట్లతో ప్రేక్షకులను అలరించి బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇలా సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తోన్న అతడు.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు తారక్ 'దేవర' అనే హై రేంజ్‌ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నార్త్ అమెరికాలో సంచలనం సృష్టించింది. దీంతో ఎన్నో రికార్డులు నమోదు అయిపోయాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూడండి!

దేవరగా మారిన స్టార్ హీరో
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన యాక్షన్ సినిమానే 'దేవర'. ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందించాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించాడు. ఇందులో శ్రీకాంత్, చాకోలు కీలక పాత్రలు చేశారు.

Jr NTR Starrer Devara Movie Crossed 2 Million Mark In USA Premiere Advance Sales

ఎన్టీఆర్ సందడి ఫుల్లుగానే
పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ఎన్టీఆర్ నటించిన 'దేవర' మూవీని హాలీవుడ్ రేంజ్‌లో ఎన్నో భాషల్లో తెరకెక్కించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 27న తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్‌తో పాటు ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. అలాగే, ప్రమోషనల్ ఈవెంట్లను కూడా ఫుల్లుగా నిర్వహిస్తోంది. దీంతో ఎన్టీఆర్ సందడి బాగా కనిపిస్తోంది.

అక్కడ ముందే మొదలు
కొరటాల శివ - ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కిన 'దేవర' మూవీ రిలీజ్ సెప్టెంబర్ 27వ తేదీన ఉండడంతో ఓవర్సీస్‌లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అక్కడ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వస్తోంది. దీంతో అప్పుడే కలెక్షన్లను కూడా భారీగానే వసూలు చేసింది. అలాగే, ఇండియాలో కూడా టికెట్ల అమ్మకాలు స్టార్ట్ అయిపోయాయి.

Jr NTR Starrer Devara Movie Crossed 2 Million Mark In USA Premiere Advance Sales

మరో మైలురాయిని దాటి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' మూవీకి సంబంధించి యూఎస్‌లో అడ్వాన్స్ సేల్స్ భారీ స్థాయిలో సాగుతున్నాయి. అక్కడ 500లకు పైగా లొకేషన్లలో 1500 షోలకు గానూ అమ్మకాలు ప్రారంభించగా.. ఇప్పటికే 1000000లకు పైగా టికెట్లు కూడా అమ్ముడుపోయినట్లు తెలిసింది. ఇలా ఈ సినిమా అక్కడ అప్పుడే 2 మిలియన్ డాలర్ల మార్కును కూడా చేరుకుంది.

అందులో ఐదో సినిమా
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' సినిమాకు నార్త్ అమెరికాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. తద్వారా ఇది విడుదలకు 3 రోజులు ముందుగానే 2 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. తద్వారా వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న 5వ తెలుగు చిత్రంగా 'దేవర' సంచలన రికార్డును నమోదు చేసుకుంది.

Jr NTR Starrer Devara Movie Crossed 2 Million Mark In USA Premiere Advance Sales

వాళ్ల రికార్డులన్నీ వెనక్కే 'దేవర' సినిమాకు నార్త్ అమెరికాలో అద్భుతమైన స్పందన వస్తోంది. ఫలితంగా ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారానే 2 మిలియన్ డాలర్ల మార్కును చేరింది. ఈ క్రమంలోనే పవన్ 'అజ్ఞాతవాసి', మహేశ్ బాబు 'గుంటూరు కారం', ప్రభాస్ 'బాహుబలి 1' రికార్డులను కూడా ఈ చిత్రం దాటింది. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే ఎన్టీఆర్ మరిన్ని రికార్డులు కొట్టడం ఖాయం అని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X