Devara: హైదరాబాద్ గడ్డపై ఎన్టీఆర్ ఊచకోత.. సలార్, RRR ఔట్.. అందులో మాత్రం ప్రభాస్‌దే రికార్డు
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సాధారణంగా ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ఆరంభంలోనే హైప్‌ను క్రియేట్ చేసుకుంటూ ఉంటాయి. అలాంటి వాటిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' మూవీ ఒకటి. అంతలా ఈ చిత్రం అంచనాలను ఏర్పరచుకుని ఈరోజే గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే 'దేవర' మూవీ తాజాగా టాలీవుడ్‌లో సరికొత్త చరిత్రను సృష్టించింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!
దేవరగా ఎన్టీఆర్ విశ్వరూపం
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన క్రేజీ సినిమానే 'దేవర' (Devara). కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. దీనికి అనిరుథ్ సంగీతం అందించాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించాడు. ఇందులో శ్రీకాంత్, చాకోలు కీలక పాత్రలను పోషించారు.

వరల్డ్ వైడ్‌గా అదే ఊపుతో
అనౌన్స్‌మెంట్ టైం నుంచే భారీ అంచనాలను ఏర్పరచుకున్న 'దేవర' మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7250కి పైగా థియేటర్లలో విడుదల చేశారు. దీంతో అన్ని ప్రాంతాలు ప్రేక్షకుల గోలతో దద్దరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లన్నీ నిండిపోయాయి. ఇలా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా హవాను చూపిస్తోంది.
టాక్‌కు తగ్గట్టే రెస్పాన్స్‌తో
యాక్షన్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'దేవర' మూవీకి సంబంధించిన షోలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పడిపోయాయి. ఈ మూవీకి టాక్ కూడా డీసెంట్‌గానే లభించింది. అంతటా దీనికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందనే వచ్చింది. దీంతో ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్
ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'దేవర' సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. చాలా ప్రాంతాల్లో ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్‌ను మొదలు పెట్టగా.. గంటల వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడు అయిపోయాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో ఈ చిత్రం సత్తా చాటుతోంది.
హైదరాబాద్‌లో రికార్డుతో
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో సాధారణ రెస్పాన్స్‌ను అందుకుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇది భారీ స్పందనతో దూసుకుపోతోంది. ఇలా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ చిత్రం రూ. 17.65 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఆ సినిమాలను దాటేసి
'దేవర' మూవీ హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ క్రమంలోనే గతంలో 'సలార్' మూవీ పేరిట ఉన్న రూ. 12.49 కోట్లు రికార్డును బ్రేక్ చేసేసింది. ఈ లిస్టులో ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' రూ. 18.90 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. వీటి తర్వాత 'సలార్', 'గుంటూరు కారం', 'RRR' సినిమాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











