Devara Day 1 Collections: ఎన్టీఆర్ పెను సంచలనం.. ఏకంగా అన్ని కోట్లతో రికార్డు.. దేవర డే 1 లెక్కలు ఇవే!
తెలుగు సినిమా స్థాయి పెరగడంతో గతంలో కంటే ఇప్పుడు ఇక్కడ భారీ బడ్జెట్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి వాటిలో కొన్ని మాత్రం ప్రత్యేకంగా నిలుస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వాటిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' ఒకటి. కోస్టల్ ఏరియా బ్యాగ్‌డ్రాప్‌తో విడుదలైన ఈ చిత్రం భారీ హైప్ విడుదలైంది. దీనికి టాక్ డీసెంట్‌గా రావడంతో ప్రేక్షకుల నుంచి స్పందన అద్భుతంగా లభించింది. ఫలితంగా ఓపెనింగ్స్‌ను భారీగా రాబట్టింది. మరి 'దేవర' మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూసేయండి!
దేవరగా ఎన్టీఆర్ విశ్వరూపం
ఎన్టీఆర్ హీరోగా నట విశ్వరూపం చూపించిన చిత్రమే 'దేవర'. కొరటాల శివ తీసిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను చేశారు. ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మించాయి. ఈ చిత్రానికి అనిరుథ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అలాగే, శ్రీకాంత్, చాకో, అజయ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.

దేవరకు బిజినెస్ ఎంతంటే
ఎన్టీఆర్ 'దేవర' మూవీకి నైజాంలో రూ. 44 కోట్లు, సీడెడ్‌లో రూ. 22 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 46.55 కోట్లతో కలిపి తెలుగులో రూ. 112.55 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 16 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 20 కోట్లు, కేరళలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 27 కోట్లతో కలుపుకుని రూ. 182.55 కోట్లు వ్యాపారం జరిగింది.
అలాంటి టాక్‌తో రెస్పాన్స్
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'దేవర' మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాక్ వచ్చిందనే చెప్పాలి. అందుకు అనుగుణంగానే రివ్యూలు కూడా డీసెంట్‌గానే వచ్చాయి. ఇది పక్కనపెడితే మొదటి రోజు ఈ సినిమాకు రెస్పాన్స్ అద్భుతంగా వచ్చింది. దీంతో ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించబోతుంది.

తొలి రోజు తెలుగు కలెక్షన్లు
మొదటి రోజు 'దేవర' తెలుగులో భారీ వసూళ్లు సాధించింది. ఫలితంగా నైజాంలో రూ. 22.64 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.37 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.45 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.73 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.20 కోట్లు, గుంటూరులో రూ. 7.24 కోట్లు, కృష్ణాలో రూ. 3.53 కోట్లు, నెల్లూరులో రూ. 2.49 కోట్లతో.. రూ. 61.65 కోట్లు షేర్, రూ. 82.20 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
'దేవర' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి తొలి రోజు తెలుగులో రూ. 61.65 కోట్లు, తమిళంలో రూ. 1.05 కోట్లు, కర్నాటకలో రూ. 6.40 కోట్లు, కేరళలో రూ. 25 లక్షలు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 24.70 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 98.60 కోట్లు షేర్, రూ. 172 కోట్లు గ్రాస్ వచ్చింది.

'దేవర' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 182.55 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 184 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది మొదటి రోజే దీనికి రూ. 98.60 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 85.34 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











