Devara Collections: ఎన్టీఆర్ మాస్ బ్యాటింగ్.. ఇటు 60 అటు 120 కోట్లు ఔట్.. దేవర ఫస్ట్ డే రిపోర్ట్ ఇదే!
తెలుగు సినిమా చరిత్రలో కొందరు హీరోలు మాత్రమే తమదైన చిత్రాలతో సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా అతి తక్కువ మంది స్టార్ హీరోలు వరుసగా హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. పాన్ ఇండియా స్టార్‌గా మారిన అతడు మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు 'దేవర' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు కలెక్షన్లు ఏ మేర వచ్చే అవకాశం ఉందో మీరే చూసేయండి మరి!
మాస్ మూవీతో వచ్చిన ఎన్టీఆర్
ఎన్టీఆర్ - కొరటాల కలయికలో రూపొందిన సినిమానే 'దేవర'. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను చేశారు. ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి అనిరుథ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అలాగే, శ్రీకాంత్, చాకో, అజయ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేశారు.

అలాంటి టాక్.. వసూళ్లు ఇలా
ఎన్నో అంచనాల నడుమ రూపొందిన 'దేవర' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే రివ్యూలు కూడా బాగానే వచ్చాయి. ఫలితంగా ఈ సినిమాకు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తొలి రోజు తెలుగులో వసూళ్లు
యాక్షన్ స్టోరీతో వచ్చిన 'దేవర' సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫస్ట్ డే టాక్‌తో సంబంధం లేకుండా రెస్పాన్స్ భారీగా లభించింది. మ్యాట్నీ నుంచి ఈ చిత్రానికి బుకింగ్స్ మరింతగానే పెరిగాయని తెలిసింది. దీంతో తొలి రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం రూ. 45 కోట్లు షేర్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

వరల్డ్ వైడ్‌గా ఎంత రావచ్చు
ఎన్టీఆర్ నటించిన 'దేవర' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు రికార్డు వసూళ్లే రాబోతున్నాయి. తెలుగులోనే కాదు.. వరల్డ్ వైడ్‌గా ఇది ఆశించిన రీతిలో పెర్ఫార్మ్ చేసిందనే ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఫలితంగా కర్నాటక, రెస్టాఫ్ ఇండియా ముఖ్యంగా ఓవర్సీస్‌లోనూ సత్తా చాటింది. ఇలా ఫస్ట్ డే ఇది రూ. 60 కోట్లు షేర్‌తో పాటు రూ. 120 కోట్లు గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉంది.
చాలా రికార్డులు బద్దలయ్యేలా
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా ఈవినింగ్ షోలు కూడా ఫుల్ అయిపోయాయి. దీంతో చాలా ప్రాంతాల్లో రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కూడా కాబోతుంది. మొత్తంగా 'దేవర'తో ఎన్టీఆర్ మాస్ బ్యాటింగ్ చేసినట్లైంది. దీంతో ఫుల్ రిపోర్టు కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











