Devara Business: ఎన్టీఆర్ సంచలన బిజినెస్.. టాప్ మూవీగా రికార్డు.. ఎన్ని కోట్లు వస్తే దేవర హిట్ అంటే!

యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ తెలుగు సినిమా రంగంలో సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇలా చాలా ఏళ్లుగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తోన్న అతడు.. ఈ మధ్యన ఫుల్ ఫామ్‌లో ఉండడంతో పాటు RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గానూ మారాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోతోన్నాడు. ఈ ఊపులోనే ఇప్పుడు ఎన్టీఆర్ 'దేవర' అనే సినిమాలో నటించాడు. భారీ అంచనాలతో రాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్‌పై మీరే లుక్కేయండి!

దేవరగా రాబోతున్న ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన హై ఓల్టేజ్ మూవీనే 'దేవర'. కొరటాల శివ తీసిన ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందించాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించాడు. ఇందులో శ్రీకాంత్, చాకోలు కీలక పాత్రల్లో నటించారు.

Jr NTR Starrer Devara Movie Worldwide Pre Release Business Details

హై ఓల్టేజ్ యాక్షన్ స్టోరీతో

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన 'దేవర' సినిమా కోస్టల్ ఏరియా బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందిన విషయం తెలిసిందే. సముద్ర తీరంలో ఉన్న కొన్ని ప్రాంతాలను కాపాడే దేవరగా ఇందులో ఎన్టీఆర్ నటించాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ సినిమాను రూపొందించారు.

Jr NTR Starrer Devara Movie Worldwide Pre Release Business Details

గ్రాండ్‌ రిలీజ్.. ప్రమోషన్
డిఫరెంట్ యాక్షన్‌తో రాబోతున్న 'దేవర' మూవీని సెప్టెంబర్ 27న ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలపై భారీ స్థాయిలోనే ఫోకస్ చేసింది. అదే సమయంలో ఓవర్సీస్‌తో పాటు ఇండియాలోని ఎన్నో ప్రాంతాల్లో టికెట్లు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. దీనికి అదిరిపోయే స్పందన కూడా వస్తోంది.

అంతటా భారీ డిమాండ్

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'దేవర' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ దక్కుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ వచ్చింది. దీనికి ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైనట్లు తెలిసింది.

Jr NTR Starrer Devara Movie Worldwide Pre Release Business Details

ఏపీ, తెలంగాణ బిజినెస్
ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్‌లో రూపొందిన 'దేవర' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 44 కోట్లు, సీడెడ్‌లో రూ. 22 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలను కలిపి రూ. 46.55 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీకి రూ. 112.55 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఇలా

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' మూవీకి దేశ వ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ వచ్చింది. దీంతో ఈ సినిమా కర్నాటకలో రూ. 16 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, హిందీలో రూ. 20 కోట్లు, కేరళలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 27 కోట్లు బిజినెస్ చేసింది. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ. 182.25 కోట్లు వ్యాపారం జరిగింది.

Jr NTR Starrer Devara Movie Worldwide Pre Release Business Details

అన్ని కోట్ల టార్గెట్.. రికార్డు
'దేవర' సినిమాకు రూ. 182.25 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో రూ. 184 కోట్లు షేర్ వసూలు అయితేనే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యధిక బిజినెస్ చేసుకున్న సోలో చిత్రాల జాబితాలో ఇది మొదటి స్థానానికి చేరింది. ఓవరాల్‌గా టాలీవుడ్‌లో అత్యధిక బిజినెస్ చేసిన సినిమాల్లో 9వ స్థానానికి చేరుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X