Devara: 7250తో ఎన్టీఆర్ మాస్ రికార్డు.. సలార్, బాహుబలి, పుష్ప ఔట్

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చే ప్రతి భారీ బడ్జెట్ చిత్రానికి అదిరిపోయే హైప్ క్రియేట్ అవుతోంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్లు నటించిన సినిమాలు మాత్రం దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతున్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలు ఓ రేంజ్‌లో హైలైట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సినిమా కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. అదే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర'. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసిందిది. ఈ నేపథ్యంలో ఈ మాస్ మూవీ థియేటర్ల కౌంట్‌ను ఒకసారి మీరే చూసేయండి మరి!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీనే 'దేవర'. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం కోస్టల్ ఏరియా బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందింది. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే పాజిటివ్ బజ్‌ను ఏర్పరచుకుంది. దీనికితోడు ఇప్పటికే దీని నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. దీంతో ఇది సెప్టెంబర్ 27న ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

Jr NTR Starrer Devara Movie Worldwide Theaters Count Details

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'దేవర' మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలు ఓవర్సీస్‌తో పాటు ఇక్కడ కూడా ప్రదర్శితం అయిపోయాయి. దీనికి అన్ని ఏరియాల్లో డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు భిన్నంగా ఈ సినిమాకు భారీ స్థాయిలో స్పందన కూడా వస్తోంది. దీంతో ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా అదిరే ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

'దేవర' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఉండడంతో దీనికి ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ రూ. 182.25 కోట్లు వరకూ జరిగింది. దీనికి తగ్గట్లే ఈ సినిమా నైజాంలో 400, సీడెడ్‌ ప్లస్ ఆంధ్రాలో 850 వరకూ అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 1250 థియేటర్ల వరకూ విడుదల అయింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 1800, ఓవర్సీస్‌లో 3700 థియేటర్లలో రిలీజ్ అయింది. తమిళనాడు, కేరళ, కర్నాటకలో కలిపి 500 అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 7250 థియేటర్లలో రిలీజ్ అయిపోయింది.

Jr NTR Starrer Devara Movie Worldwide Theaters Count Details

ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'దేవర' మూవీ ప్రపంచ వ్యాప్తంగా 7250కి పైగా థియేటర్లలో విడుదల అయింది. దీంతో అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతున్న తెలుగు హీరోల చిత్రాల లిస్టులో ఇది 5వ స్థానానికి చేరింది. ఇందులో RRR 10200 థియేటర్లలో టాప్‌లో ఉంది. ఆ తర్వాత బాహుబలి 2, కల్కి 2898 ఏడీ, సాహో మూవీలు ఉన్నాయి. 'దేవర' తర్వాత రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, సైరా నరసింహారెడ్డి, బాహుబలి, పుష్ప 1 సినిమాలు నిలిచాయి.

ఇదిలా ఉండగా.. 'దేవర' మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను చేశారు. ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి అనిరుథ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అలాగే, శ్రీకాంత్, చాకో, అజయ్, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Read more about: devara jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X