Simhadri: రీరిలీజ్‌లో సింహాద్రి పెను సంచలనం.. ఆ సినిమాల టోటల్ వసూళ్లు దాటి.. ఎన్టీఆర్ నయా రికార్డు
గతంలో కంటే ఇప్పుడు ఎంతో వేగంగా థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీల ద్వారా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. దీంతో సినిమా హాళ్లకు వెళ్లి మూవీలను చూడాలంటే చాలా మంది వెనకడుగు వేసే పరిస్థితులు వస్తున్నాయి. అలాంటిది ఈ మధ్య కాలంలో తెలుగులో పాత సినిమాల రీ రిలీజ్‌ల ట్రెండ్ కనిపిస్తోంది. ఇలా చాలా చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన 'సింహాద్రి' రి రిలీజ్ అవబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం పెను సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే...
ఎన్టీఆర్ బర్త్‌కు సింహాద్రి:ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లోని స్టార్ హీరో పుట్టినరోజులకు వాళ్లు నటించిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన 'సింహాద్రి' సినిమా వంతు ఇప్పుడొచ్చింది. అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నారు.

కలెక్షన్లను ఫ్యాన్స్ కోసం:'సింహాద్రి' సినిమా రీ రిలీజ్ ద్వారా వచ్చిన డబ్బును ఫ్యాన్స్‌కే వాడబోతున్నారు. ఈ మేరకు ఇటీవలే ఓ ప్రకటనలో 'ఈ రీ రిలీజ్ ద్వారా వచ్చే కలెక్షన్లను ఫ్యాన్స్‌కే తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇందుకోసం రీ రిలీజ్ ద్వారా వచ్చే డబ్బును ఏ జిల్లాకు ఆ జిల్లాలో కష్టాల్లో ఉన్న ఎన్టీఆర్ గారి అభిమానులకు సాయంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం' అని తెలిపారు.
భారీ ఏర్పాట్లు.. హడావిడి:క్రేజీ కాంబినేషన్‌లో వచ్చి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 'సింహాద్రి' మూవీని మే 20వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నారు. దీన్ని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వరల్డ్ వైడ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు దీని కోసం తగు ఏర్పాట్లను చేస్తున్నారు. దీంతో 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా హడావిడే కనిపిస్తోంది.

బిగ్ స్క్రీన్‌లోనూ రిలీజ్:యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను స్టార్ హీరోగా మార్చిన 'సింహాద్రి' సినిమా రీ రిలీజ్‌ను ఫ్యాన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఈ చిత్రాన్ని ప్రపంచంలోనే పెద్ద స్క్రీన్ ఉన్న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న ఐమాక్స్‌లో కూడా రిలీజ్ చేస్తున్నారు. గతంలో ఏ సినిమా కూడా అక్కడ రీ రిలీజ్ అవలేదు. దీంతో సింహాద్రి మూవీ రికార్డు నమోదు చేసింది.
ఆస్ట్రేలియాలో వసూళ్లు:ఆస్ట్రేలియాలో నందమూరి అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకే 'సింహాద్రి' మూవీ రి రిలీజ్‌కు అక్కడ భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేకాదు, ఆస్ట్రేలియాలో అడ్వాన్స్ బుకింగ్స్‌కు భారీ స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ఏకంగా 3,784 ఆస్ట్రేలియన్ డాలర్లను వసూలు చేసింది. రిలీజ్ టైంకు ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

ఆ సినిమాల రికార్డ్ బ్రేక్:తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ మొదలైన తర్వాత ఆస్ట్రేలియాలో పలు చిత్రాలు విడుదల అయ్యాయి. అందులో మహేశ్ బాబు 'పోకిరి' మూవీ 3733 ఆస్ట్రేలియన్ డాలర్లు, 'ఒక్కడు' 3480 ఆస్ట్రేలియన్ డాలర్లను వసూలు చేశాయి. అయితే, ఇప్పుడు 'సింహాద్రి' మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఆ చిత్రాల కలెక్షన్లను దాటింది. దీంతో తారక్ నయా సంచలన రికార్డు కొట్టేశాడు.


Click it and Unblock the Notifications











