Devara Day 10 Collections : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న దేవర.. 10వ రోజు ఎన్టీఆర్ మూవీకి ఎన్ని కోట్లంటే?
కొరటాల శివ- జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన దేవర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి వారంలోనే రూ.400 కోట్లను చేరుకున్న ఎన్టీఆర్ మూవీ.. సెకండ్ వీక్ కాస్త స్లో అయినా డీసెంట్ వసూళ్లను రాబడుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దసరా సెలవుల నేపథ్యంలో రూ.500 కోట్ల మార్క్‌ను చేరుకునే దిశగా దేవర దూసుకెళ్తున్నాడు. కొన్ని ఏరియాల్లో వసూళ్లు పడిపోయినా డీలా పడకుండా ఎన్టీఆర్ తన మేజిక్ చూపిస్తున్నాడు. మరి 10వ రోజు దేవర ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లు రాబట్టాడో చూస్తే :
ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి రోల్‌లో ఎన్టీఆర్‌తో ధీటుగా నటించాడు . జనతా గ్యారేజ్ తర్వాత రెండోసారి కొరటాల శివతో జోడీకట్టాడు ఎన్టీఆర్. చిరంజీవితో తీసిన ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల శివ దర్శకుడిగా తనను తాను నిరూపించుకోవాలనే కసితో ఈ సినిమాను తెరకెక్కించారు. దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు సంయుక్తంగా నిర్మించారు. సెప్టెంబర్ 27న రిలీజైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఏపీ, తెలంగాణ, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

విపరీతంగా హైప్ రావడంతో దేవరకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నైజాంలో రూ.44 కోట్లు, సీడెడ్‌లో రూ.22 కోట్లు, ఆంధ్రాలో రూ.46.55 కోట్లు కలిపి మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటకలో రూ.16 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ. కోటి, ఓవర్సీస్‌లో రూ.27 కోట్లు , ఇండియా వైడ్ రూ.20 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ.182.55 కోట్ల బిజినెస్ జరిగినట్లు పేర్కొన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,250 థియేటర్లలో రిలీజైన దేవర .. రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తో బరిలో దిగి ఫస్ట్ వీక్‌లోనే నిర్మాతలను, బయ్యర్లను ఒడ్డున పడేసింది. మొదటి రోజు రూ.172 కోట్లు, రెండో రోజు రూ.71 కోట్లు, మూడో రోజు రూ. 40 కోట్లు, నాలుగో రోజు రూ. 25 కోట్లు, ఐదో రోజు రూ.40కోట్లు, ఆరో రోజు రూ.40 కోట్లు, ఏడో రోజు రూ.20 కోట్లు, ఎనిమిదో రోజు రూ.13 కోట్లు, 9వ రోజు రూ.12 కోట్ల వసూళ్లను సాధించింది. మరి 10వ రోజు దేవర ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో బాగానే బుకింగ్స్ జరిగాయి. ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో రూ.9 కోట్లు, హిందీలో రూ.2.5 కోట్లు, కర్ణాటక , తమిళనాడు, కేరళ, ఓవర్సీస్ కలుపుకుని రూ.4 కోట్ల వసూళ్లను రాబట్టింది. మొత్తంగా దేవర పదో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 16 కోట్ల నికర వసూళ్లను సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఎన్టీఆర్ మూవీ పది రోజుల్లో రూ. 36 కోట్ల లాభాలను అందుకున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఆది, సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ కెరీర్‌లో ఈ రేంజ్‌లో ప్రాఫిట్ రావడం ఇదేనని అంటున్నారు. థియేటర్లలో బిజినెస్ క్లోజ్ చేసే నాటికి దేవర ఇంకెన్ని లాభాలను అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











