Devara Day 11 Collections : ఎన్టీఆర్ కలెక్షన్ల విధ్వంసం.. 11వ రోజు దేవరకు ఎన్ని కోట్లంటే?
సాలీడ్ కలెక్షన్స్‌తో దుమ్మలేపుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఏ మాత్రం డిజప్పాయింట్ చేయకుండా.. ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోయేలా వసూళ్లు రాబడుతోంది దేవర. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ఛేదించిన ఎన్టీఆర్.. సెకండ్ వీక్ లాభాలను పంచి పెడుతున్నాడు. నార్త్ , సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా కుమ్మపడేస్తున్నాడు. మరి 11వ రోజు దేవర సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్లను రాబట్టిందో ఒకసారి చూస్తే :
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర తొలి వారంలోనే రూ.400 కోట్లను చేరుకుని రూ.500 కోట్ల మార్క్‌ను కొట్టాలని కసిగా పరుగులు తీస్తోంది. సెకండ్ వీక్ కాస్త స్లో అయినా వసూళ్లకు ఢోకా లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించారు. దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు సంయుక్తంగా నిర్మించారు.

జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ నటించిన మూవీ కావడంతో దేవరపై భారీ అంచనాలున్నాయి. ఈ హైప్ కారణంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,250 థియేటర్లలో రిలీజైన దేవర .. రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తో బరిలో దిగింది.
దేవర మొదటి రోజు రూ.172 కోట్లు, రెండో రోజు రూ.71 కోట్లు, మూడో రోజు రూ. 40 కోట్లు, నాలుగో రోజు రూ. 25 కోట్లు, ఐదో రోజు రూ.40కోట్లు, ఆరో రోజు రూ.40 కోట్లు, ఏడో రోజు రూ.20 కోట్లు, ఎనిమిదో రోజు రూ.13 కోట్లు, 9వ రోజు రూ.12 కోట్లు, 10వ రోజు రూ.19 కోట్లు వసూళ్లను సాధించింది. మరి 11వ రోజు దేవర ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే.. సెలవుల కారణంగా బుకింగ్స్ ఫస్ట్ వీక్ మాదిరిగా జరుగుతున్నాయి. టికెట్ ధరలు సాధారణ స్థితికి చేరుకోవడంతో వర్కింగ్ డేస్‌లోనూ దేవర వసూళ్ల పంట పండిస్తున్నాడు. 11వ రోజు దేవర తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్లు, హిందీ, తమిళ్, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలుపుకుని రూ.3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. కోటిన్నర చొప్పున మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రూ.9 కోట్ల వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు .. రాయలసీమలో ఎన్టీఆర్ దేవర సరికొత్త రికార్డులు నమోదు చేసింది. నాన్‌స్టాప్‌గా ఆరు రోజుల పాటు రూ.కోటికి తగ్గకుండా షేర్‌ని అందుకున్న దేవర .. వేగంగా రూ.20 కోట్ల షేర్‌ని, ఆ వెంటనే ఫాస్టెస్ట్ రూ.25 కోట్ల షేర్‌ని కొట్టింది. మొత్తంగా 10 రోజుల్లోనే రూ.26 కోట్ల షేర్‌ని అందుకుని.. సీడెడ్ ప్రాంతంలో రెండు సార్లు రూ.26 కోట్ల షేర్‌ను అందుకున్న ఒకే ఒక్క హీరోగా జూనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించాడు. సెకండ్ వీకెండ్ కూడా ఇలాగే జోరు చూపిస్తే దేవర రాయలసీమలో రూ.30 కోట్ల షేర్ అందుకోవడం పెద్ద కష్టం కాదని ట్రేడ్ పండితులు అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది.


Click it and Unblock the Notifications











