Devara Day 13 Collections : ఎన్టీఆర్ మాస్ జాతర.. 13వ రోజు దేవరకు ఎన్ని కోట్లంటే ?

ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సెప్టెంబర్ 27న రిలీజై తొలుత మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా పరిస్ధితి ఏంటి అనుకున్న వారికి నెక్ట్స్ డే నుంచి షాకిచ్చాడు తారక్. విమర్శకుల అంచనాలను తలక్రిందులు చేస్తూ కేవలం వారం రోజుల్లోనే దేవరను ఒడ్డున పడేశాడు. ఈ స్థాయి వసూళ్లను బహుశా చిత్ర యూనిట్ సైతం ఊహించి ఉండదు. మరి 13వ రోజున దేవర ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లను అందుకుందో ఒకసారి చూస్తే :

దేవరలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించారు. వీరిద్దరికి తెలుగులో ఇదే డెబ్యూ మూవీ. వీరితో పాటు శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

jr ntr s devara movie 13 days box office collections report here s the details

కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబినేషన్ , ఆర్ఆర్ఆర్‌ తర్వాత ఎన్టీఆర్ నటించిన మూవీ కావడంతో దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,250 థియేటర్లలో రిలీజైన దేవర .. రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తో బరిలో దిగింది.

దేవర మొదటి రోజు రూ.172 కోట్లు, రెండో రోజు రూ.71 కోట్లు, మూడో రోజు రూ. 40 కోట్లు, నాలుగో రోజు రూ. 25 కోట్లు, ఐదో రోజు రూ.40కోట్లు, ఆరో రోజు రూ.40 కోట్లు, ఏడో రోజు రూ.20 కోట్లు, ఎనిమిదో రోజు రూ.13 కోట్లు, 9వ రోజు రూ.12 కోట్లు, 10వ రోజు రూ.19 కోట్లు, 11వ రోజు రూ.9 కోట్లు, 12వ రోజు రూ.7 కోట్ల వసూళ్లను సాధించింది. మరి 13వ రోజు ఎన్టీఆర్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో చూస్తే : వర్కింగ్ డే అయినప్పటికీ కొన్ని ఏరియాల్లో హౌస్‌ఫుల్ షోలు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లోని బీ, సీ సెంటర్‌లు, సీడెడ్ వంటి మాస్ సెంటర్‌లలో దేవరకు మంచి ఆక్యూపెన్సీ లభిస్తోంది. దేవర 13వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్లు, హిందీలో రూ. కోటిన్నర, కర్ణాటక , రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ.70 లక్షల చొప్పున మొత్తంగా రూ.6.5 కోట్ల వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

jr ntr s devara movie 13 days box office collections report here s the details

12 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ.201 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకున్న దేవర .. వరల్డ్ వైడ్‌గా రూ. 398 కోట్లను రాబట్టింది. 13వ రోజు నాటి వసూళ్లతో కలిపి రూ.400 కోట్ల మార్క్‌ను ఛేదించి బయ్యర్లకు మంచి లాభాలను అందిస్తోంది. 12వ రోజున ఆల్‌టైం హైయెస్ట్ షేర్ అందుకున్న టాలీవుడ్ సినిమాల్లో బాహుబలి 2 (రూ.5.49 కోట్లు) టాప్‌లో ఉండగా.. దేవర (రూ.2.16 కోట్ల) పదో స్థానంలో నిలిచింది. గురువారం తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయన్ ది హంటర్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. తమిళనాడు, కర్ణాటక, ఓవర్సీస్‌లో ఈ సినిమా నుంచి దేవరకు పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకుల అంచనా.

More from Filmibeat

Read more about: jr ntr devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X