Devara Day 14 Collections : బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ సునామీ .. 14వ రోజు దేవరకు ఎన్ని కోట్లంటే?
ఆర్ఆర్ఆర్ తర్వాత సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు దేవరతో వచ్చిన ఎన్టీఆర్ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. నార్త్ , సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల ఎక్సలెంట్ వసూళ్లతో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటేసి లాభాలను పంచుతోంది దేవర. లాభాల పరంగానూ ఎన్టీఆర్ కెరీర్‌లో ది బెస్ట్‌లలో ఒకటిగా నిలించింది దేవర . తెలుగు సినిమాల్లోనూ ప్రాఫిట్స్ పరంగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన దేవర 14వ రోజు ఎంత వసూలు చేశాడో చూస్తే
దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. దేవరలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు.

ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్ కావడంతో పాటు ఆచార్య తర్వాత కొరటాల ఎలా డీల్ చేశాడోనని ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. దీంతో దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. అన్ని సెంటర్స్‌లలో డిస్ట్రిబ్యూషన్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్ల లక్ష్యంతో దేవర బరిలో దిగింది.
దేవర మొదటి రోజు రూ.172 కోట్లు, రెండో రోజు రూ.71 కోట్లు, మూడో రోజు రూ. 40 కోట్లు, నాలుగో రోజు రూ. 25 కోట్లు, ఐదో రోజు రూ.40కోట్లు, ఆరో రోజు రూ.40 కోట్లు, ఏడో రోజు రూ.20 కోట్లు, ఎనిమిదో రోజు రూ.13 కోట్లు, 9వ రోజు రూ.12 కోట్లు, 10వ రోజు రూ.19 కోట్లు, 11వ రోజు రూ.9 కోట్లు, 12వ రోజు రూ.7 కోట్లు, 13వ రోజు రూ.6.5 కోట్ల వసూళ్లను సాధించింది. మరి 14వ రోజు ఎన్టీఆర్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో చూస్తే : 13వ రోజు మాదిరే బుకింగ్స్‌లో డ్రాప్స్ కనిపించాయి. అయితే పర్వలేదనిపించుకునేలా టిక్కెట్లు తెగాయి.
14వ రోజు దేవరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్ల షేర్, హిందీలో రూ. కోటి, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ.50 లక్షల షేర్‌ని అందుకుంది. మొత్తంగా 14వ రోజు ఎన్టీఆర్ మూవీకి రూ. 4.2 కోట్ల షేర్ అందినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా రెండు వారాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ చేసి రూ.50 కోట్ల వరకు దేవర లాభాలను అందించినట్లుగా ఫిలింనగర్ టాక్. దసరా సెలవులు మరో మూడు రోజులు ఉండటంతో ఈ సినిమా మరిన్ని లాభాలను సంపాదించి పెడుతుందని అంటున్నారు.

దేవరకు తొలి నుంచి అండగా నిలిచిన ఓవర్సీస్ మార్కెట్‌లో ముఖ్యంగా నార్త్ అమెరికాలో మరో రికార్డ్ అందుకున్నాడు. నార్త్ అమెరికాలో 6 మిలియన్స్ మార్క్‌ను ఎన్టీఆర్ మరోసారి దాటేశాడు. గతంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ద్వారా ఒకసారి ఈ ఘనత సాధించాడు తారక్. ఈ లిస్ట్‌లో ప్రభాస్ నాలుగు సార్లు స్థానం సంపాదించాడు. డార్లింగ్ నటించిన బాహుబలి 2, బాహుబలి 1, సలార్, కల్కి సినిమాలు 6 మిలియన్ మార్క్‌ను క్రాస్ చేశాయి. వీరి తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా రామ్ చరణ్ కూడా తన పేరిట 6 మిలియన్ సినిమాను లిఖించాడు.


Click it and Unblock the Notifications











