Devara Day 15 Collections : టఫ్ ఫైట్‌లోనూ కుమ్మేసిన ఎన్టీఆర్ .. 15వ రోజు దేవరకు ఎన్ని కోట్లంటే?
జూనియర్ ఎన్టీఆర్ దేవర అంచనాలకు అందని విధంగా దూసుకెళ్తోంది. తొలిరోజు ఈ సినిమా టాక్, రివ్యూలు చూసినవాళ్లు ఈ కలెక్షన్ల సునామీని తట్టుకోవడం కష్టమే. అలాంటి టాక్ అందుకున్న దేవర ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టించడానికి జూనియర్ ఎన్టీఆరే కారణం. మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఆయన తన భుజాలపై సినిమాను మోశారు. వరుస సెలవులు, లాంగ్ వీకెండ్ కారణంగా దేవర వసూళ్లు ఈ స్థాయిలో వచ్చాయి. సెకండ్ వీక్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన దేవర.. మూడో వారంలోకి అడుగుపెట్టింది. మరి 15వ రోజు జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో ఒకసారి చూస్తే
దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. జాన్వీ కపూర్ , సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. టీజర్, ట్రైలర్ల ద్వారా వచ్చిన హైప్‌కు తోడు కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్ కావడంతో దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్ల లక్ష్యంతో దేవర బరిలో దిగింది. ప్రపంచవ్యాప్తంగా 7250 థియేటర్‌లలో గ్రాండ్‌గా రిలీజైన దేవర .. కనివినీ ఎరుగని ఓపెనింగ్స్‌ని రాబట్టింది.

దేవర మొదటి రోజు రూ.172 కోట్లు, రెండో రోజు రూ.71 కోట్లు, మూడో రోజు రూ. 40 కోట్లు, నాలుగో రోజు రూ. 25 కోట్లు, ఐదో రోజు రూ.40కోట్లు, ఆరో రోజు రూ.40 కోట్లు, ఏడో రోజు రూ.20 కోట్లు, ఎనిమిదో రోజు రూ.13 కోట్లు, 9వ రోజు రూ.12 కోట్లు, 10వ రోజు రూ.19 కోట్లు, 11వ రోజు రూ.9 కోట్లు, 12వ రోజు రూ.7 కోట్లు, 13వ రోజు రూ.6.5 కోట్లు, 14వ రోజు 5.3 కోట్లు వసూలు చేసింది. వేట్టయన్, స్వాగ్, విశ్వం, మార్టిన్ తదితర సినిమాల ప్రభావం కారణంగా 15వ రోజు బుకింగ్స్‌లో డ్రాప్స్ కనిపించినా.. కొన్ని చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించాయి.
15వ రోజు దేవరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్లు, హిందీలో రూ.కోటి , కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ.75 లక్షల షేర్‌ని అందుకుంది. మొత్తంగా 15వ రోజు ఎన్టీఆర్ మూవీకి వరల్డ్ వైడ్‌గా రూ. 4 కోట్ల షేర్ అందినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నార్త్ అమెరికాలో 6 మిలియన్స్ మార్క్‌ను ఎన్టీఆర్ రెండోసారి అందుకున్నాడు. ఈ లిస్ట్‌లో ప్రభాస్ నాలుగు సార్లు స్థానం సంపాదించాడు. రామ్ చరణ్ కూడా తన పేరిట 6 మిలియన్ సినిమాను లిఖించాడు.

మొత్తం మీద ఈ 15 రోజుల్లో దేవర తెలుగు రాష్ట్రాల్లో రూ.209 కోట్ల గ్రాస్, వరల్డ్ వైడ్‌గా రూ.413 కోట్ల గ్రాస్ అందుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పండుగ సెలవులు మరో రెండ్రోజులు ఉండటంతో దేవర మరింత హోల్డ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫైనల్ లెక్కలు ముగిసేసరికి ఎన్టీఆర్ ఎన్ని కోట్ల మేర లాభాలను అందిస్తాడోనని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ విజయంతో దర్శకుడు కొరటాల శివకు పెద్ద రిలీఫ్ దక్కినట్లయ్యింది.


Click it and Unblock the Notifications











