Devara Day 17 Collections: బాక్సాఫీస్‌ను అల్లాడిస్తున్న ఎన్టీఆర్..17వ రోజు దేవరకు ఎన్ని కోట్లంటే?
బాక్సాఫీస్ వద్ద దాదాపు ఆరేళ్ల తర్వాత సోలోగా ఎంట్రీ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. తనకు జనతా గ్యారేజ్ వంటి హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమే దేవర. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌ను సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7250 థియేటర్‌లలో రిలీజ్ చేశారు. తొలి రోజు మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ సినిమాను తన భుజాలపై మోసి రూ. 400 కోట్ల కలెక్షన్‌లను దాటించాడు. రెండు వారాలు ముగిసేసరికి బయ్యర్లు మంచి లాభాలను అందుకుంటున్నారు. మరి 17వ రోజు దేవర ఎన్ని కోట్లు సాధించాడో చూస్తే
దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. జాన్వీ కపూర్ , సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్ , ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న మూవీ కావడంతో ఇండస్ట్రీలో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అందుకు తగినట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల వ్యాపారం చేసింది దేవర. రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో దిగిన దేవర రెండు వారాల థియేట్రికల్ రన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసి మూడో వారంలోకి ఎంటరైంది. దేవర బాక్సాఫీస్ వద్ద 16 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.215 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.418 కోట్లకు పైగా గ్రాస్ మార్క్‌ను అందుకుని ఎన్టీఆర్ కెరీర్‌లో మెమొరబుల్ హిట్‌గా నిలిచింది.
దసరా నాడు కనిపించిన ఊపే 17వ రోజైన ఆదివారం నాడు కొనసాగింది. చాలా ఏరియాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించాయి. పండగ సెలవుల్లో లాస్ డే కావడంతో అభిమానులు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో దేవరను వీక్షించేందుకు ఎగబడ్డారు. 17వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.64 కోట్లు, హిందీ, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ.83 లక్షలు , ఓవర్సీస్‌లో రూ.40 లక్షల నికర వసూళ్లు సాధించింది దేవర. మొత్తంగా ఆదివారం దేవర నికరంగా రూ.7 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలాఉండగా.. దేవర ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రూ.50 కోట్లకు పైగా లాభాలను అందించింది. మూడో వారం పూర్తయ్యేసరికి ఏపీ, తెలంగాణలలో రూ.150 కోట్ల షేర్ మార్క్‌ను క్రాస్ చేశాడు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ రూ.150 కోట్ల షేర్‌ని అందుకున్న రెండో హీరోగా ఎన్టీఆర్ నిలిచారు. ఈ రికార్డుపరంగా ప్రభాస్ ముందున్నారు. బాహుబలి 2, సలార్, కల్కి సినిమాలతో ప్రభాస్ ఈ ఘనత అందుకున్నారు. మరి థియేటర్‌లో బిజినెస్ క్లోజ్ చేసే నాటికి ఎన్టీఆర్ ఎన్ని రికార్డులు నెలకొల్పుతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











