Devara Day 18 Collections : భారీగా పడిపోయిన దేవర వసూళ్లు.. 18వ రోజు ఎన్టీఆర్ మూవీకి ఎన్ని కోట్లంటే?

దసరా సెలవుల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించిన దేవర కలెక్షన్ల వర్షం కురిపించింది. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధిస్తుండటంతో విశ్లేషకులు సైతం ఖంగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మేజిక్‌తో మెల్లిగా సినిమా అందుకుని రెండు వారాలు గడిచేసరికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఛేదించి లాభాల్లోకి వచ్చింది. మరి 18వ రోజు దేవర ఎన్ని కోట్లు సాధించాడో చూస్తే

పండగ సెలవులు కలిసి రావడంతో దేవరకు తొలి రెండు వారాలు దేవరకు ఎదురులేకుండా పోయింది. దసరా కానుకగా రజనీకాంత్ వేట్టయన్ సహా చిన్నా పెద్దా సినిమాలు బరిలో దిగడంతో కొన్ని ప్రాంతాల్లో మినహా దేవరకు అడ్డు లేకుండా పోయింది. మూడో వారం పూర్తయ్యేసరికి ఏపీ, తెలంగాణలలో రూ.150 కోట్ల షేర్ మార్క్‌ను క్రాస్ చేశారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ రూ.150 కోట్ల షేర్‌ని అందుకున్న రెండో హీరోగా నిలిచారు.

jr ntr s devara movie 18 days box office collections report here s the details

దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. జాన్వీ కపూర్ , సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. దేవర ద్వారా జాన్వీ, సైఫ్‌లు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న మూవీ కావడంతో పాటు కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఇండస్ట్రీలో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల వ్యాపారం చేసింది దేవర. రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది. తొలి రోజే ఈ సినిమాకు రికార్డు స్థాయిలో రూ.172 కోట్ల ఓపెనింగ్స్ దక్కాయి.

jr ntr s devara movie 18 days box office collections report here s the details

ఇక 18వ రోజు దేవర ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో చూస్తే . ఆదివారంతో దసరా సెలవులు ముగియడంతో సోమవారం స్కూళ్లు, కాలేజీలు తెరచుకున్నాయి. వర్కింగ్ డే కావడంతో మార్నింగ్ షో నుంచి బుకింగ్స్ అంతంత మాత్రంగా జరిగాయి. అయితే ఫస్ట్ షో, సెకండ్ షోలకు చెప్పుకోదగ్గ స్థాయిలో దేవర హోల్డ్ చేసినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. 18వ రోజు దేవర ప్రపంచవ్యాప్తంగా రూ.4 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.3 కోట్లు, కర్ణాటక, తమిళనాడు, హిందీ, రెస్టాఫ్ ఇండియాలలో రూ. కోటి, ఓవర్సీస్‌లో రూ.40 లక్షల మేర రాబట్టిందని తెలిపారు. మరి ఈ వీక్‌లో సెకండ్ వర్కింగ్ డే నాడు దేవర ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X