Devara Day 19 Collections: బాక్సాఫీస్ షేక్, రూ.30 కోట్లతో ఎన్టీఆర్ రేర్ ఫీట్..19వ రోజు దేవరకి ఎన్ని కోట్లంటే?
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన దేవర అంచనాలను మించి రాణిస్తోంది. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు లాభాలను అందిస్తోన్న ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే విజయవంతంగా మూడో వారాన్ని ఫినిష్ చేసుకోనుంది. మొదటి రోజు నుంచి నేటి వరకు ఊహకందని మైలురాళ్లను అందుకుంటూ సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో 19వ రోజు దేవర ఎన్ని కోట్లు సాధించాడో చూస్తే .
మూడో వారం ముగింపుకు వచ్చేసరికి ఏపీ, తెలంగాణలలో రూ.150 కోట్లకు పైగాషేర్ మార్క్‌ను అందుకోనున్నారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో బ్యాక్ టూ బ్యాక్ రూ.150 కోట్ల షేర్‌ని అందుకున్న రెండో హీరోగా నిలిచారు. రాయలసీమ ఏరియాలో ఎన్టీఆర్‌కు తొలి నుంచి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆయన గత చిత్రాలన్నీ ఇక్కడి బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. తాజాగా దేవర సీడెడ్ ఏరియాలో సరికొత్త రికార్డులను సృష్టించింది.

ఇప్పటి వరకు ఏకంగా రూ.30 కోట్ల షేర్‌ను అందుకుని సీమలో చరిత్ర సృష్టించాడు ఎన్టీఆర్. తద్వారా ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 ల తర్వాత ఈ ఏరియాలో రూ. 30 కోట్ల రేంజ్‌లో షేర్‌ను అందుకున్న సినిమాగా దేవర నిలిచింది. టాలీవుడ్ హీరోలలో ఈ రికార్డును రెండు సార్లు అందుకున్న హీరోగా యంగ్ టైగర్ నిలిచాడు. గతంలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ద్వారా తారక్ ఈ ఘనత దక్కించుకున్నాడు. ఆ వెంటనే బ్యాక్ టూ బ్యాక్ ఈ మార్క్‌ను అందుకున్న వన్ అండ్ ఓన్లీ హీరోగా నిలిచాడు ఎన్టీఆర్. థియేట్రికల్ బిజినెస్ ముగిసేసరికి దేవర రాయలసీమ ఏరియాలో ఇంకెన్ని కోట్లు రాబడతాడో చూడాలి.
ఇకపోతే.. దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. జాన్వీ కపూర్ , సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. దేవర ద్వారా జాన్వీ, సైఫ్‌లు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల వ్యాపారం చేసింది దేవర. రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది. తొలి రోజే ఈ సినిమాకు రికార్డు స్థాయిలో రూ.172 కోట్ల ఓపెనింగ్స్ దక్కాయి. ఇక 19వ రోజు దేవర ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో చూస్తే .. దసరా సెలవులు ముగిసిన తర్వాత సెకండ్ వర్కింగ్ డే కావడంతో బుకింగ్స్ స్లో అయ్యాయి. 19వ రోజు దేవర ప్రపంచవ్యాప్తంగా రూ.4 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.2.5 కోట్లు, కర్ణాటక, తమిళనాడు, హిందీ, రెస్టాఫ్ ఇండియాలలో రూ. 80, ఓవర్సీస్‌లో రూ.30 లక్షల మేర రాబట్టిందని తెలిపారు. మరి థర్డ్ వీక్ ముగిసే సరికి దేవర ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











