Devara Day 2 Andhra, Nizam Collection : తెలుగు రాష్ట్రాల్లో దేవర కలెక్షన్ల జాతర.. రెండో రోజు ఎన్ని కోట్లంటే?

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్‌లు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. డీసెంట్ టాక్ , పాజిటివ్ రివ్యూలతో దేవరకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. ఫలితంగా తొలిరోజే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించిన దేవర ఈ రెండ్రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి పరిశీలిస్తే :

జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివతో జూనియర్ జత కట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవరకు అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించగా.. శ్రీకాంత్, చాకో, అజయ్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. దేవరకు నైజాంలో రూ.44 కోట్లు, సీడెడ్‌లో రూ.22 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.46.55 కోట్లు కలిపి మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్ల బిజినెస్ జరిగింది. కర్ణాటకలో రూ.16 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ. కోటి, ఓవర్సీస్‌లో రూ.27 కోట్లు , ఇండియా వైడ్ రూ.20 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ.182.55 కోట్ల బిజినెస్ జరిగింది.

jr ntr s devara movie 2 days box office collections report of Andhra and Nizam here s the details

ఫస్ట్ డే ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబట్టింది దేవర. తెలుగులో రూ.82.20 కోట్ల గ్రాస్, రూ.61.65 కోట్ల షేర్ అందుకుంది. తమిళంలో రూ.1.05 కోట్లు, కర్ణాటకలో రూ.6.40 కోట్లు, కేరళలో రూ.25 లక్షలు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ.4.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.24.70 కోట్లు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.98.60 కోట్ల షేర్.. రూ.172 కోట్ల గ్రాస్‌ని దేవర కొల్లగొట్టింది. దేవర లాభాల్లోకి రావాలంటే ఇంకా రూ.85.34 కోట్ల షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.

రెండో రోజు కూడా దేవర బాగానే హోల్డ్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.16 కోట్ల షేర్ వసూలు చేసింది. మిగిలిన ప్రాంతాల్లో రూ.10 కోట్లు రాబట్టినట్లుగా ఫిలింనగర్ టాక్. మొత్తంగా రూ.110 కోట్ల షేర్‌తో పాటు ఇప్పటి వరకు రూ.220 కోట్ల గ్రాస్‌ను దేవర అందుకుందని ట్రేడ్ వర్గాల అంచనా. అంతా బాగానే ఉంది కానీ తెలుగు రాష్ట్రాల్లో దేవర లాభాల్లోకి రావాలంటే ఇంకెంత కొట్టాలి, ఎంత కొడితే బయ్యర్లు ఒడ్డున పడతారనే చర్చ నడుస్తోంది.

jr ntr s devara movie 2 days box office collections report of Andhra and Nizam here s the details

తెలుగు రాష్ట్రాల్లో దేవర రెండో రోజు నైజాం ఏరియాలో రూ.6.94 కోట్లు, సీడెడ్‌లో రూ.3.77 కోట్లు, విశాఖలో రూ.1.68 కోట్లు, ఈస్ట్‌లో 86 లక్షలు, వెస్ట్‌లో 48 లక్షలు, కృష్ణాలో రూ.95 లక్షలు, గుంటూరులో 82 లక్షలు, నెల్లూరులో రూ.62 లక్షలను ఎన్టీఆర్ మూవీ రాబట్టినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా రెండ్రోజుల్లో దేవర తెలుగు రాష్ట్రాల్లో రూ.70.33 కోట్లను వసూలు చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో మంచి ఆక్యూపెన్సీ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్‌లో మరే పెద్ద సినిమా లేకపోవడంతో దేవర జోరుకు ఇప్పట్లో బ్రేక్ పడదని ఎన్టీఆర్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: jr ntr devara koratala siva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X