Devara Day 20 Collections : బాక్సాఫీస్ వద్ద శాంతించిన దేవర తుఫాను .. 20వ రోజు ఎన్టీఆర్ మూవీకి ఎన్ని కోట్లంటే?
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర మూడో వారం కలెక్షన్స్ తగ్గుముఖం పడుతున్నాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికీ హౌస్‌ఫుల్ బోర్డ్స్ పడుతుండటం విశేషం. మెయిన్ సెంటర్స్ సహా బీ, సీ క్లాస్ ఏరియాల్లో తారక్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికే రాయలసీమ ఏరియాలో 19 రోజుల వరకు రూ.30 కోట్ల షేర్‌ను అందుకుని వరుసగా రెండో సారి ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా ఎన్టీఆర్ రికార్డుల్లోకెక్కారు. ఈ నేపథ్యంలో 20వ రోజు దేవర ఎన్ని కోట్లు సాధించాడో చూస్తే .
దసరా సెలవులు ముగిసిన తర్వాత దేవర వసూళ్లపై ప్రభావం పడింది. బుధవారం ఫుల్ వర్కింగ్ డే అయినప్పటికీ కొన్ని చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. ముఖ్యంగా విశాఖ, విజయనగరం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు , రాయలసీమ జిల్లాల్లో ఎక్స్‌లెంట్ ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. విడుదలైన 20వ రోజు కూడా ఇలాంటి ప్రభావం చూపిన రేర్ సినిమాల్లో ఒకటిగా దేవర నిలిచింది. మిక్స్‌డ్ టాక్ వచ్చినా దేవర ఈ రేంజ్‌లో ప్రభావం చూపడానికి కారణం మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఫస్ట్ వీక్ ముగిసిన తర్వాత కూడా రోజుకి కోటి తగ్గకుండా షేర్ వసూలు చేసింది దేవర.

దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. జాన్వీ కపూర్ , సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. దేవర ద్వారా జాన్వీ, సైఫ్‌లు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించడం, దాదాపు ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా వస్తుండటంతో దేవరపై భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు కొరటాల శివ కాంబినేషన్ కావడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. దీనికి తగినట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దుమ్ము రేపాడు ఎన్టీఆర్. తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల వ్యాపారం చేసింది దేవర. దీంతో రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ని ఫిక్స్ చేశారు ట్రేడ్ పండితులు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7250 థియేటర్‌లలో రిలీజైన దేవరకు తొలి రోజే ఈ సినిమాకు రికార్డు స్థాయిలో రూ.172 కోట్ల ఓపెనింగ్స్ దక్కాయి. ఇక 20వ రోజు దేవర ఎన్ని కోట్ల వసూళ్లు రాబట్టిందో చూస్తే .. దసరా సెలవులు ముగిసిన తర్వాత మూడవ రోజు, ఫుల్ వర్కింగ్ డే కావడంతో బుకింగ్స్ స్లో అయ్యాయి. 20వ రోజు దేవర ప్రపంచవ్యాప్తంగా రూ.3 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్లు, కర్ణాటక, తమిళనాడు, హిందీ, రెస్టాఫ్ ఇండియాలలో రూ. 75 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.25 లక్షల మేర రాబట్టిందని తెలిపారు. మరి థర్డ్ వీక్ ముగిసే సరికి దేవర ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











