Devara Day 23 Collections : తుక్కురేగ్గొడుతోన్న ఎన్టీఆర్ .. 23వ రోజు దేవరకు ఎన్ని కోట్లంటే?
బాక్సాఫీస్ వద్ద మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రభంజనం కొనసాగుతోంది. వీకెండ్ అయినా, వర్కింగ్ డే అయినా తగ్గేదే లేదు అన్నట్లుగా తారక్ విశ్వరూపం చూపిస్తున్నారు. విడుదలై మూడు వారాలు ముగిసినా దేవర థియేటర్ల వద్ద అదే సందడి కనిపిస్తోంది. ఇప్పటికే కనివినీ ఎరుగని లాభాలను బయ్యర్లకు అందిస్తున్న దేవర .. లాంగ్ రన్‌లో ఇంకెన్నీ కోట్లను రాబడతాడోనని ఇండస్ట్రీ ఉత్కంఠతో ఉంది. ఈ నేపథ్యంలో 23వ రోజు దేవర ఎన్ని కోట్లు సాధించాడో చూస్తే .
కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం దేవర. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పైగా ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల టేకప్ చేసిన సినిమా కావడంతో ఆయన హిట్ కొడతాడా లేదా అన్న డిస్కషన్ నడిచింది. దర్శకుడిగా తనను తాను నిరూపించుకోవాలని అనుకున్న శివ అన్ని జాగ్రత్తలు తీసుకుని కసిగా ఈ మూవీ తెరకెక్కించారు. సక్సెస్‌మీట్‌లో ఎన్టీఆర్ కూడా ఇదే చెప్పారు. దేవర సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి షూటింగ్ కంప్లీట్ చేసే వరకు శివ ముఖంలో నవ్వు లేదన్నారు.

కాంబినేషన్‌తో పాటు టీజర్, ట్రైలర్, పాటలతో భారీ హైప్‌ను సొంతం చేసుకున్న దేవర థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. జాన్వీ కపూర్ , సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. దేవర ద్వారా జాన్వీ, సైఫ్‌లు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది దేవర. దీంతో రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7250 థియేటర్‌లలో రిలీజైన దేవర రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో దేవర రూ.112.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే .. మూడు వారాల్లో ఏకంగా రూ.156.5 కోట్లకు పైగా షేర్ సొంతం చేసుకుని రూ.45 కోట్లకు పైగా లాభాలను బయ్యర్లకు పంచింది. 22 రోజులకు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా దేవర రూ.250 కోట్ల షేర్ అందుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

దసరా సెలవులు ముగియడంతో కాస్త డల్ అయిన దేవరకు నిన్నటి నుంచి వీకెండ్ మొదలు కావడంతో తిరిగి బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి. 23వ రోజు దేవర ప్రపంచవ్యాప్తంగా రూ.2.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.1.80 కోట్లు, కర్ణాటక, తమిళనాడు, హిందీ, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లను కలుపుకుని రూ.75 లక్షల మేర రాబట్టిందని అంటున్నారు. మొత్తంగా ఈ వీకెండ్ దేవర ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











