Devara Day 24 Collections : అంతకుమించి అనేలా ఎన్టీఆర్ విధ్వంసం .. 24వ రోజు దేవరకు ఎన్ని కోట్లంటే?

దసరా సెలవులు ముగిసిన తర్వాత వచ్చిన మరో వీకెండ్‌లో ఎన్టీఆర్ దుమ్ము రేపాడు. చాలా చోట్ల తొలి వీక్ మాదిరిగా టికెట్స్ బుక్ అవ్వడంతో దేవర మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇప్పటికే బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందించిన ఎన్టీఆర్ మూవీ.. ఈ వీకెండ్ కలెక్షన్ల వర్షం కురిపించిందిని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి దేవర మూవీ ఏయే ఏరియాల్లో ఎంత వసూలు చేసింది.. మొత్తంగా 24వ రోజు ఎన్టీఆర్ ఎన్ని కోట్లు సాధించాడో చూస్తే .

గతంలో కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్‌బస్టర్ కావడంతో దేవరపై భారీ అంచనాలున్నాయి. పైగా ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల ఇంటా బయటా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఆయన సత్తాపై నమ్మకం ఉన్నవాళ్లు కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లోనే ఎన్టీఆర్ అవకాశం ఇవ్వడంతో దేవరపై భారీ బజ్ నెలకొంది. ఇప్పుడైన కొరటాల హిట్ కొడతాడా లేదా అన్న డిస్కషన్ నడిచింది.

jr ntr s devara movie 24 days box office collections report here s the details

తనను నమ్మి అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్‌ నమ్మకం వమ్ము చేయకూడదని శివ అన్ని జాగ్రత్తలు తీసుకుని కసిగా ఈ మూవీ తెరకెక్కించారు. దేవర సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి షూటింగ్ కంప్లీట్ చేసే వరకు శివ ముఖంలో నవ్వు లేదని స్వయంగా ఎన్టీఆర్ చెప్పారంటే కొరటాల ఎంత టెన్షన్ పడ్డారో అర్ధం చేసుకోవచ్చు. కానీ సినిమా రిలీజై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోవడంతో తొలుత యూనిట్ షాక్‌కు గురైంది. కానీ ఎన్టీఆర్ తన ఇమేజ్‌తో సినిమాను మోశారు.

టీజర్, ట్రైలర్, పాటలతో భారీ హైప్‌ను సొంతం చేసుకున్న దేవర థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. జాన్వీ కపూర్ , సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. దేవర ద్వారా జాన్వీ, సైఫ్‌లు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

jr ntr s devara movie 24 days box office collections report here s the details

తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది దేవర. దీంతో రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌‌తో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7250 థియేటర్‌లలో రిలీజైన దేవర రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. 23 రోజుల వరకు ఈ చిత్రం రూ.340 కోట్ల నెట్, రూ.514 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, ఎన్టీఆర్ కెరీర్‌లో ఆల్‌టైమ్ రికార్డులు నెలకొల్పింది.

దసరా సెలవులు ముగియడంతో దేవర పని అయిపోయింది అనుకునేలా ఈ వీకెండ్ దుమ్మ తెలిపాడు ఎన్టీఆర్. 24వ రోజు ఆదివారం దేవర ప్రపంచవ్యాప్తంగా రూ.4.20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.2.30 కోట్లు, కర్ణాటక, తమిళనాడు, హిందీ, రెస్టాఫ్ ఇండియాలలో రూ. 1.40 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 40 లక్షలు మేర రాబట్టిందని అంటున్నారు. మొత్తంగా 24 రోజుల వరకు దేవర తెలుగు రాష్ట్రాల్లో రూ.70 కోట్ల లాభాలను అందించి ట్రేడ్ పండితులనే ఆశ్చర్యపరుస్తోంది. దీపావళి వరకు ఎన్టీఆర్ రోజుకు రూ. కోటి తగ్గకుండా వసూళ్లు సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Read more about: jr ntr devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X