Devara Day 25 Collections : ఎన్టీఆర్ మాస్ కుమ్ముడు .. కల్కి రికార్డ్ ఔట్, 25వ రోజు దేవరకు ఎన్ని కోట్లంటే?
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగం దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. తొలి రోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న దేవర తర్వాత పుంజుకుని భారీ లాభాలను అందించింది. విడుదలై నాలుగు వారాలు పూర్తి కావొస్తున్నా బాక్సాఫీస్ వద్ద దేవర ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 25వ రోజు ఎన్టీఆర్ మూవీ ఎన్ని కోట్లు సాధించిందో చూస్తే .
ఆచార్య డిజాస్టర్ తర్వాత దర్శకుడిగా తాను తిరిగి నిలబడటానికి ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని అనుకున్నారు కొరటాల శివ. ఏ పాయింట్‌లోనూ రాజీ పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని దేవరను తీర్చిదిద్దారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమాను తీయాలని ముందే నిర్ణయించిన కొరటాల అందుకు తగిన విధంగా స్క్రిప్ట్ రాసుకున్నారు. తొలి భాగంలో ఎంత మేరకు చూపించాలి, ఏమేం ట్విస్టులు ఇవ్వాలి అనేది ప్రిపేర్ అయ్యారు. ఈ ప్లాన్ సూపర్ సక్సెస్ అయి దేవరకు కలిసొచ్చింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా పార్ట్ 2 కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. జాన్వీ కపూర్ , సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. దేవర ద్వారా జాన్వీ, సైఫ్‌లు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.
టీజర్, ట్రైలర్, పాటలతో భారీ హైప్‌ను సొంతం చేసుకున్న దేవర థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది దేవర. దీంతో రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఎన్టీఆర్ బరిలో దిగారు. దసరా సెలవులు ముగిసినా మంచి వసూళ్లు రాబడుతున్న దేవర 25వ రోజు కాస్త డల్ అయ్యాడు. ఆదివారం బాదిపడేసిన ఎన్టీఆర్ .. వర్కిండ్ డే అయిన సోమవారం భారీగా నిరాశపరిచాడు. 25వ రోజు దేవర ప్రపంచవ్యాప్తంగా రూ. 1.65 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే సాధించింది.

కాగా.. ఆంధ్రా ఏరియాలో దేవర సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ రికార్డులనే బ్రేక్ చేశాడు. కల్కి ఏపీలో రూ.94.47 కోట్ల షేర్‌ని అందుకుంటే .. దేవర 25 రోజుల్లోనే ఏకంగా రూ.97.50 కోట్ల షేర్‌ని అందుకుని సంచలనం సృష్టించింది. అయితే తెలంగాణలో మాత్రం కల్కిని దేవర టచ్ చేయలేకపోయింది. థియేట్రికల్ రన్ ముగిసే సరికి దేవర ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











