Devara Day 27 Collections : భారీగా పడిపోయిన దేవర వసూళ్లు .. 27వ రోజు ఎన్టీఆర్‌ మూవీకి ఎన్ని కోట్లంటే?

బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని విధంగా విధ్వంసం సృష్టించింది ఎన్టీఆర్ దేవర. ఎక్స్‌లెంట్ కలెక్షన్స్‌తో లాంగ్ రన్‌ను దక్కించుకుని ఇటీవలి కాలంలో ఈ ఫీట్ సాధించిన మూవీగా నిలిచింది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక , ఓవర్సీస్‌లో ఫస్ట్ వీక్ మాదిరిగా వసూళ్లు రాబడుతున్నాడు ఎన్టీఆర్. రోజుకు రూ. కోటి తగ్గకుండా షేర్ సాధిస్తూ కళ్లు చెదిరే లాభాలను అందించాడు దేవర. ఈ నేపథ్యంలో 27వ రోజు ఎన్టీఆర్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. తొలుత మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఈ రేంజ్‌లో వసూళ్లను సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఎన్టీఆర్ తన మాస్ ఇమేజ్‌తో సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టారు. రిలీజ్ అయిన నాటి నుంచి రోజుకు రూ. కోటి తగ్గకుండా షేర్ సాధించిన దేవర నాలుగో వారంలో కాస్తంత డల్ అయ్యాడు.

jr ntr s devara movie 27 days box office collections report here s the details

దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. జాన్వీ కపూర్ , సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. దేవర ద్వారా జాన్వీ, సైఫ్‌లు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్‌లో రెండో చిత్రం కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్, పాటలతో భారీ బజ్‌ను సొంతం చేసుకున్న దేవర మూవీ.. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల కోసం విపరీతమైన డిమాండ్ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది దేవర. దీంతో రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌‌తో ఎన్టీఆర్ బరిలో దిగారు.

jr ntr s devara movie 27 days box office collections report here s the details

ప్రపంచవ్యాప్తంగా 7250 థియేటర్‌లలో రిలీజైన దేవర భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. 25 రోజుల్లో ఊహాకందని విధంగా వసూళ్లను అందుకుని తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తెలుగు వెర్షన్ సినిమాల్లో గ్రాస్ పరంగా ఆర్ఆర్ఆర్, బాహుబలి 2, కల్కి, సలార్ తర్వాతి స్థానంలో దేవర నిలిచింది. 26 రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.160 కోట్ల షేర్‌ను దక్కించుకుని రూ. 47.50 కోట్ల లాభాలను దక్కించుకుంది. ఇందులో ఒక్క నైజాం ప్రాంతంలోనే రూ.18 కోట్లకు పైగా లాభాలను బయ్యర్లకు అందించింది.

ఇక 27వ రోజు దేవర వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే.. బుధవారం కలెక్షన్స్ బాగా పడిపోయాయి. 27వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. కోటి 10 లక్షల వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరో రెండ్రోజుల్లో వీకెండ్ ప్రారంభం కానుండటంతో దేవర మరోసారి తన ప్రతాపం చూపిస్తాడని విశ్లేషకులు అంటున్నారు. దీపావళి వరకు మార్కెట్‌లో మరో కొత్త సినిమా లేకపోవడంతో దేవర కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

More from Filmibeat

Read more about: jr ntr devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X