Devara Day 30 Collections : ఎండ్ కార్డ్ దిశగా దేవర .. 30వ రోజు ఎన్టీఆర్‌ మూవీకి ఎన్ని కోట్లంటే?

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర 5వ వారంలోకి అడుగుపెట్టింది. లాంగ్ రన్‌లో కొన్ని చోట్ల మంచి హోల్డ్ సాధిస్తోంది దేవర. ఇప్పటికే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుని, భారీ లాభాలను బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు అందించింది. ఎన్నో సినిమాలు దేవర మేనియాలో కొట్టుకుపోగా.. మరికొన్ని మూవీస్ రిలీజ్‌ని వాయిదా వేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 30వ రోజు ఎన్టీఆర్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దేవర సరికొత్త రికార్డులు నెలకొల్పింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా. దీంతో రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌‌గా విలువ కట్టారు ట్రేడ్ పండితులు . ప్రపంచవ్యాప్తంగా 7250 థియేటర్‌లలో రిలీజైన దేవర భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. నాలుగో వారం ఇండియా వైడ్‌ నికరంగా రూ.7.8 కోట్ల వసూళ్లను దేవర సాధించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 6.33 కోట్లు, హిందీ , రెస్టాఫ్ ఇండియా, కర్ణాటక, తమిళనాడు, ఓవర్సీస్ నుంచి రూ.1.30 కోట్ల మేర నికర వసూళ్లను ఎన్టీఆర్ మూవీ దక్కించుకుంది.

jr ntr s devara movie 30 days box office collections report here s the details

దేవర 29 రోజుల వరకు రూ. 72 కోట్లకు పైగా లాభాలను అందుకుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వరల్డ్ వైడ్‌గా రూ.182.25 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.245.29 కోట్ల రేంజ్‌లో షేర్ రాబట్టింది. రూ.75 కోట్ల రేంజ్‌లో లాభాలను అందుకోవాలని దేవర ట్రై చేస్తున్నాడు. అయితే ఈ వీకెండ్ తర్వాత కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి. 5వ వారంలో ఉన్న లిమిటెడ్ థియేటర్స్‌లోనే దేవర లాభాలను చూడాల్సి ఉంటుంది.

కాగా.. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ , ఇతర ఖర్చులు కలుపుకుని దేవరను రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. జాన్వీ కపూర్ , సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. దేవర ద్వారా జాన్వీ, సైఫ్‌లు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

jr ntr s devara movie 30 days box office collections report here s the details

5వ వారంలో డల్ అవుతుంది అనుకున్న దేవర కొన్ని చోట్ల బుకింగ్స్‌లో దుమ్ము రేపింది. ఇప్పటికీ ఆడియన్స్‌ థియేటర్‌కు వస్తుండటం సానుకూల పరిణామంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీపావళి వీక్‌తో దేవర థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పండగ వరకు పెద్ద సినిమాలు లేకపోవడంతో ఎన్టీఆర్ మూవీ మరిన్ని కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇక 30వ రోజు దేవర వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే.. వీకెండ్ కావడంతో సినిమాకు బెటర్ బుకింగ్స్ దక్కాయి. 30వ రోజు ప్రపంచవ్యాప్తంగా దేవర నికరంగా రూ. 70 లక్షల కలెక్షన్స్ రాబట్టింది. ఈరోజు ఆదివారం కావడంతో బుకింగ్స్ బాగుంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Read more about: jr ntr devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X