Devara Day 31 Collections:వీకెండ్‌లో కుమ్మేసిన NTR..బన్నీ రికార్డ్‌పై కన్ను,31వ రోజు దేవరకి ఎన్ని కోట్లంటే?

బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో హయ్యెస్ట్ గ్రాస్ మూవీస్‌లో ఒకటిగా నిలవడమంటే మామూలు విషయం కాదు. అలాంటి ఘనతను సొంతం చేసుకున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించిన దేవర ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలై 5వ వారంలోకి అడుగుపెట్టిన దేవర 31వ రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ , ఇతర ఖర్చులు కలుపుకుని దేవరను రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కించారు.. జాన్వీ కపూర్ , సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. దేవర ద్వారా జాన్వీ, సైఫ్‌లు టాలీవుడ్‌లో అడుగుపెట్టారు.

jr ntr s devara movie 31 days box office collections report here s the details

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో పాటు కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న సెకండ్ మూవీ కావడంతో దేవరపై భారీ బజ్ నెలకొంది. దీనికి తోడు టీజర్, ట్రైలర్లు దీనిని మరింత పెంచేశాయి. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దేవర సరికొత్త రికార్డులు నెలకొల్పింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల కోసం బయ్యర్లు ఎగబడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా. దీంతో రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌‌గా విలువ కట్టారు ట్రేడ్ పండితులు .

గత సినిమాల రికార్డులు తిరగరాస్తూ ప్రపంచవ్యాప్తంగా 7250 థియేటర్‌లలో రిలీజైన దేవర భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. 30 రోజుల వరకు రూ. 72 కోట్లకు పైగా లాభాలను అందుకుని నిర్మాతని, బయ్యర్లని ఒడ్డున పడేసింది. వరల్డ్ వైడ్‌గా రూ.182.25 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.245.29 కోట్ల రేంజ్‌లో షేర్ రాబట్టింది. 5వ వారంలో డల్ అవుతుంది అనుకున్న దేవర వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో కొన్ని సెంటర్స్‌లో దుమ్ము రేపింది. ఇక 31వ రోజు దేవర ప్రపంచవ్యాప్తంగా రూ.1.30 కోట్ల వసూళ్లు అందుకున్నట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఐదో వారంలో ఒక రోజు రూ. కోటికి తగ్గకుండా కలెక్షన్స్ రాబట్టడం మామూలు విషయం కాదని విశ్లేషకులు అంటున్నారు.

jr ntr s devara movie 31 days box office collections report here s the details

ఇదిలాఉండగా.. సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన దేవర మరో రికార్డుపై కన్నేసింది. అది కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాపై. త్రివిక్రమ్ దర్శకత్వంలో నాలుగేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా వచ్చిన అల వైకుంఠపురంలో టోటల్ రన్‌లో సాధించిన ప్రాఫిట్‌ను దేవర క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బన్నీ మూవీ అప్పట్లో రూ. 84.34 కోట్ల బిజినెస్ చేయగా టోటల్ రన్‌లో రూ. 75.88 కోట్ల లాభాలను కళ్లజూసింది. ఇప్పుడు దేవర విషయానికి వస్తే రూ. 182.25 కోట్ల బిజినెస్ జరగ్గా 31 రోజులలో 73.28 కోట్ల రేంజ్‌లో ప్రాఫిట్ అందుకుంది. దీపావళి వరకు దేవర సందడి చేసే అవకాశాలు ఉండటంతో అల వైకుంఠ పురంలో రికార్డును ఎన్టీఆర్ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

More from Filmibeat

Read more about: jr ntr devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X