Devara Day 32 Collections : దేవర స్పీడుకి బ్రేకులు .. 32వ రోజు ఎన్టీఆర్ మూవీకి ఎన్ని కోట్లంటే?

కొరటాల శివ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర థియేట్రికల్ బిజినెస్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. 5వ వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా వీకెండ్‌ మంచి హోల్డ్ సాధించగా.. వర్కింగ్ డే అయిన సోమవారం భారీ డ్రాప్స్ నమోదైనట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే కొన్ని సెంటర్స్‌లో మాత్రం దేవరకు బుకింగ్స్ బాగానే జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి 32వ రోజు ఎన్టీఆర్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుని ఎవరూ ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్‌గా , తెలుగులో హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది దేవర. లాంగ్ రన్‌లో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో కలెక్షన్ల రికార్డును బద్ధలు కొట్టే దిశగా దూసుకెళ్తోంది. బన్నీ మూవీ అప్పట్లో రూ. 84.34 కోట్ల బిజినెస్ చేయగా టోటల్ రన్‌లో రూ. 75.88 కోట్ల లాభాలను అందుకుంది. ఇప్పుడు దేవర విషయానికి వస్తే రూ. 182.25 కోట్ల బిజినెస్ జరగ్గా 31 రోజులలో 73.28 కోట్ల రేంజ్‌లో ప్రాఫిట్ రాబట్టింది. దీపావళి ముగిసిన తర్వాత దేవర థియేట్రికల్ రన్ ముగుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

jr ntr s devara movie 32 days box office collections report here s the details

అయితే 5వ వారంలోనూ దేవర వసూళ్లను రాబడుతున్నది ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. కేరళలో ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోగా.. తమిళనాడు కూడా ఈ లిస్ట్‌లో చేరింది. తమిళనాడులో రూ. 6 కోట్ల రేంజ్‌లో దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. రూ.11.10 గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుని.. రూ. 4.56 కోట్ల వరకు షేర్ రాబట్టింది. ఓవరాల్‌గా 70 శాతం రికవరీ సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ , ఇతర ఖర్చులు కలుపుకుని దేవరను రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కించారు.. జాన్వీ కపూర్ , సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. దేవర ద్వారా జాన్వీ, సైఫ్‌లు టాలీవుడ్‌లో అడుగుపెట్టారు.

jr ntr s devara movie 32 days box office collections report here s the details

తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా. దీంతో రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌‌గా విలువ కట్టారు ట్రేడ్ పండితులు . గత సినిమాల రికార్డులు తిరగరాస్తూ ప్రపంచవ్యాప్తంగా 7250 థియేటర్‌లలో రిలీజైన దేవర భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.248.76 కోట్ల రేంజ్‌లో షేర్ రాబట్టింది.

5వ వారంలోనూ 31వ రోజు దేవర ప్రపంచవ్యాప్తంగా రూ.1.30 కోట్ల వసూళ్లు అందుకుని ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక 32వ రోజు దేవర వసూళ్ల విషయానికి వస్తే.. ఆదివారంతో పోలిస్తే దాదాపు 65 శాతం బుకింగ్స్ డ్రాప్ అయినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. సోమవారం ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ మూవీ నికరంగా రూ.72 లక్షల కలెక్షన్స్ సాధించింది. రెండ్రోజుల్లో దీపావళి సందడి మొదలవ్వనుండటంతో ఎన్టీఆర్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చేడాలి.

More from Filmibeat

Read more about: jr ntr devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X