Devara Day 33 Collections : దారుణంగా దేవర కలెక్షన్స్ .. 33వ రోజు ఎన్టీఆర్ మూవీకి ఎన్ని కోట్లంటే?

కొరటాల శివ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన మూవీ దేవర . సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ మూవీ మరికొద్దిరోజుల్లో థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోనుంది. భారీ అంచనాలతో విడుదలైన దేవర తొలి రోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఎన్టీఆర్ తన ఇమేజ్‌తో ఈ సినిమాను మోస్తూ బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టారు. మరి 33వ రోజు ఎన్టీఆర్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో ఒకసారి చూస్తే :

ఆల్‌మోస్ట్ క్లోజింగ్ స్టేజ్‌కు చేరుకున్న దేవర తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే బండి లాక్కొస్తోంది. దాదాపు 19 రోజుల పాటు రోజుకు రూ. కోటి తగ్గకుండా షేర్‌ని... 24 రోజుల పాటు వరల్డ్ వైడ్‌గా రూ. కోటి తగ్గకుండా గ్రాస్‌ని, ఆ తర్వాత రోజుకు రూ. 50 లక్షలు తగ్గకుండా షేర్‌ని అందుకుంది దేవర. తెలుగు రాష్ట్రాలకు వెలుపల దేవర థియేట్రికల్ రన్ పూర్తయినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

jr ntr s devara movie 33 days box office collections report here s the details

కేరళలో ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోగా.. తమిళనాడు కూడా ఈ లిస్ట్‌లో చేరింది. తమిళంలో రూ. 6 కోట్ల రేంజ్‌లో దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. రూ.11.10 గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుని.. రూ. 4.56 కోట్ల వరకు షేర్ రాబట్టింది. ఓవరాల్‌గా 70 శాతం రికవరీ అంచనా వేస్తున్నాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ , ఇతర ఖర్చులు కలుపుకుని దేవరను రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కించారు.. జాన్వీ కపూర్ , సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. దేవర ద్వారా జాన్వీ, సైఫ్‌లు టాలీవుడ్‌లో అడుగుపెట్టారు.

jr ntr s devara movie 33 days box office collections report here s the details

తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా. దీంతో రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌‌గా విలువ కట్టారు ట్రేడ్ పండితులు . ఇటీవలి కాలంలో విడుదలైన పలు స్టార్ హీరోల సినిమాల రికార్డులు తిరగరాస్తూ ప్రపంచవ్యాప్తంగా 7250 థియేటర్‌లలో రిలీజైన దేవర భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.250 కోట్ల రేంజ్‌లో షేర్ రాబట్టింది.

ఐదో వారంలోకి ఎంటరైన తర్వాత గత ఆదివారం మంచి వసూళ్లను సాధించిన దేవర.. వర్కింగ్ డేస్ మొదలయ్యాక బాక్సాఫీస్ వద్ద స్లో అయ్యాడు. 33వ రోజు కొన్ని సెంటర్స్ మినహా చాలా ఏరియాల్లో దేవర బుకింగ్స్ దాదాపు 70 శాతం వరకు పడిపోయినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. 33వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ మూవీ నికరంగా రూ. 40 లక్షల వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండ్రోజుల్లో దీపావళి సినిమాల సందడి మొదలవ్వనుండటంతో దేవర హవా ఎలా కొనసాగుతుందో చూడాలి.

More from Filmibeat

Read more about: jr ntr devara koratala siva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X