Devara Day 34 Collections : దేవరకు భారీ దెబ్బ .. 34వ రోజు ఎన్టీఆర్ మూవీకి ఎన్ని కోట్లంటే?
దేవర సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన ఊచకోత ఎలా ఉందో చూపిస్తున్నాడు. సోలో హీరోగా ఆరేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చి రికార్డులను తిరగరాస్తున్నాడు. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న దేవర ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టించడానికి ఎన్టీఆర్ మాస్ ఇమేజే కారణం. దసరా సీజన్‌లో ఎన్నో చిత్రాలు పొటీలో ఉన్నప్పటికీ ఎన్టీఆర్ తన విశ్వరూపం చూపించి బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందజేశారు. మరి 34వ రోజు ఎన్టీఆర్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో ఒకసారి చూస్తే :
దీపావళి నాడు దాదాపు అరడజను సినిమాలు రిలీజ్ కానుండటంతో పండగతో దేవర థియేట్రికల్ రన్ ముగుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. దాదాపు 34 రోజుల పాటు బాక్సాఫీస్‌ను కుమ్మిపడేశారు ఎన్టీఆర్ . తెలుగు రాష్ట్రాలు, హిందీ, ఓవర్సీస్‌లో సరికొత్త రికార్డులు సెట్ చేశారు తారక్. ఇప్పట్లో ఆ రికార్డులు చెక్కు చెదరవని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దసరా సీజన్‌కు దేవర బ్లాక్‌బస్టర్‌గా నిలిచి .. ఫెస్టివల్ డేస్‌ను ఘనంగా ముగించింది. కేరళలో ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోగా.. తమిళనాడు కూడా ఈ లిస్ట్‌లో చేరింది. తమిళంలో రూ. 6 కోట్ల రేంజ్‌లో దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. రూ.11.10 గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుని.. రూ. 4.56 కోట్ల వరకు షేర్ రాబట్టింది. ఓవరాల్‌గా 70 శాతం రికవరీ అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ , ప్రచార కార్యక్రమాలు ఇతర ఖర్చులు కలుపుకుని దేవరను రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కించారు.. జాన్వీ కపూర్ , సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. దేవర ద్వారా జాన్వీ, సైఫ్‌లు టాలీవుడ్‌లో అడుగుపెట్టారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో పాటు కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా. దీంతో రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా విలువ కట్టారు ట్రేడ్ పండితులు . ఈ సినిమా 34 రోజుల వరకు రూ.260 కోట్ల రేంజ్‌లో షేర్ రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఐదో వారంలోనూ ఎక్స్‌లెంట్ హోల్డ్ చూపించిన దేవర.. గత వీకెండ్ మంచి వసూళ్లను రాబట్టింది. వర్కింగ్ డేస్ మొదలయ్యాక ఎన్టీఆర్ స్లో అయ్యాడు. 34వ రోజు కొన్ని సెంటర్స్ మినహా చాలా ఏరియాల్లో దేవర బుకింగ్స్ దాదాపు 80 శాతం వరకు పడిపోయినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. 34వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ మూవీ నికరంగా రూ. 35 లక్షల వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్కీ భాస్కర్, అమరన్, క తదితర సినిమాలు రిలీజ్ కానుండటంతో దేవర థియేట్రికల్ రన్‌కు ఈ వారంతో ఎండ్ కార్డ్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











