Devara Day 4 Collections : లాభాల్లోకి బయ్యర్లు..ప్రభాస్ తర్వాత ఎన్టీఆరే, నాలుగో రోజు దేవర బాక్సాఫీస్ రిపోర్ట్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దేవర. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు నిర్మించారు. విడుదలై నాలుగు రోజులు కావొస్తుండగా .. ఇప్పటి వరకు దేవర ఎన్ని కోట్ల వసూళ్లను రాబట్టాడో చూస్తే :

జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ నటించిన మూవీ కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్, పోస్టర్స్ దీనికి మరింత హైప్‌ను తీసుకొచ్చాయి. అందుకు తగినట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దుమ్మురేపిన దేవర.. ప్రీ సేల్స్‌లోనూ దూసుకెళ్లాడు. ముఖ్యంగా ఓవర్సీస్‌లో రిలీజ్‌కు ముందే ఎన్టీఆర్ సంచలనాలు సృష్టించాడు. అడ్వాన్స్ బుకింగ్‌లోనే 1 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించిన తొలి భారతీయ చిత్రంగా దేవర నిలిచింది.

jr ntr s devara movie 4 days box office collections report here s the details

ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నైజాంలో రూ.44 కోట్లు, సీడెడ్‌లో రూ.22 కోట్లు, ఆంధ్రాలో రూ.46.55 కోట్లు కలిపి మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటకలో రూ.16 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ. కోటి, ఓవర్సీస్‌లో రూ.27 కోట్లు , ఇండియా వైడ్ రూ.20 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ.182.55 కోట్ల బిజినెస్ జరిగింది. రూ.190 కోట్ల షేర్, రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌గా దేవర జర్నీ స్టార్ట్ చేశాడు.

దేవర ఫస్ట్ వీకెండ్ నాటికి తొలి మూడు రోజులు కలుపుకుని ఏపీ తెలంగాణలలో రూ.87.7 కోట్ల షేర్, రూ.135.1 కోట్ల గ్రాస్ సాధించింది. ఇండియా వైడ్‌గా రూ.117.3 కోట్ల షేర్, రూ.204 కోట్ల గ్రాస్ అందుకుంది. వరల్డ్ వైడ్‌గా రూ.145.95 కోట్ల షేర్ , రూ.263.7 కోట్ల గ్రాస్ రాబట్టింది. మూడో రోజు.. తెలుగు రాష్ట్రాల్లో రూ.27.65 కోట్ల నికర వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హిందీలో రూ.11 కోట్లు, కర్ణాటకలో రూ.35 లక్షలు, తమిళనాడులో రూ.1.05 కోట్లు, మలయాళంలో రూ.25 లక్షల కలెక్షన్స్ కలుపుకుని ఇండియా వైడ్‌‌గా రూ.40.30 కోట్ల నికర వసూళ్లను సాధించినట్లుగా ఫిలింనగర్ టాక్. ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా.. మొత్తంగా దేవర మూడో రోజు వరల్డ్ వైడ్‌గా రూ.48 కోట్ల వసూళ్లను రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు అంటున్నారు.

jr ntr s devara movie 4 days box office collections report here s the details

ఇక నాలుగో రోజు దేవర ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే : వర్కింగ్ డే కావడంతో సోమవారం దేవర కాస్త స్లో అయ్యాడు. అయినప్పటికీ డీసెంట్‌గానే వసూళ్లు రాబట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.8 కోట్లు, హిందీలో రూ.4 కోట్లు, కర్ణాటకలో రూ.10 లక్షలు, తమిళనాడులో రూ.30 లక్షలు, మలయాళంలో రూ.10 లక్షలు కలుపుకుని ఇండియా వైడ్‌గా రూ.13 కోట్ల నికర వసూళ్లను సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఓవర్సీస్‌లో మాత్రం దేవర ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ చేసిన దేవర 5 మిలియన్ల క్లబ్‌లో చేరాడు. సోమవారం నుంచి ఓవర్సీస్‌ బయ్యర్లు లాభాలను కళ్ల చూస్తున్నారట. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కెరీర్‌లో సెకండ్ 5 మిలియన్ మూవీగా దేవర నిలిచింది. తెలుగు హీరోలలో అత్యధికంగా 5 మిలియన్ డాలర్లు వసూలు చేసిన హీరోలలో ప్రభాస్ టాప్ ప్లేస్‌లో నిలిచారు. డార్లింగ్ గత చిత్రాలు బాహుబలి 1, బాహుబలి 2, సలార్, కల్కి నార్త్ అమెరికాలో 5 మిలియన్ డాలర్లను రాబట్టాయి.

More from Filmibeat

Read more about: jr ntr devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X