Devara Day 5 Collections : టాక్‌తో సంబంధం లేదమ్మా! , ఊచకోతే.. ఐదు రోజుల్లో దేవర వసూళ్లు ఎన్ని కోట్లంటే?
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ తదితరులు నటించిన సినిమా దేవర. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు నిర్మించారు. విడుదలై ఐదు రోజులు కావొస్తుండగా .. దేవర లాభాల్లోకి వచ్చాడా, ఏయే ఏరియాల్లో ఎంత వసూలు చేశాడో పరిశీలిస్తే :
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన మూవీ కావడంతో దేవరపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు జనతా గ్యారేజ్ తర్వాత కొరటాలతో ఎన్టీఆర్ జత కట్టిన నేపథ్యంలో దీనికి మరింత హైప్ వచ్చింది. అందుకు తగినట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దుమ్మురేపిన దేవర.. ప్రీ సేల్స్‌లోనూ దూసుకెళ్లాడు. ముఖ్యంగా ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్‌లోనే 1 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించిన తొలి భారతీయ చిత్రంగా దేవర నిలిచింది.

ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించాడు. నైజాంలో రూ.44 కోట్లు, సీడెడ్‌లో రూ.22 కోట్లు, ఆంధ్రాలో రూ.46.55 కోట్లు కలిపి మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటకలో రూ.16 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ. కోటి, ఓవర్సీస్‌లో రూ.27 కోట్లు , ఇండియా వైడ్ రూ.20 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ.182.55 కోట్ల బిజినెస్ జరిగింది. రూ.190 కోట్ల షేర్, రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌గా దేవర జర్నీ స్టార్ట్ చేశాడు.
ప్రపంచవ్యాప్తంగా 7250 థియేటర్‌లలో రిలీజైన దేవర.. ఫస్ట్ వీకెండ్ నాటికి తొలి మూడు రోజులు కలుపుకుని ఏపీ తెలంగాణలలో రూ.87.7 కోట్ల షేర్, రూ.135.1 కోట్ల గ్రాస్ సాధించింది. ఇండియా వైడ్‌గా రూ.117.3 కోట్ల షేర్, రూ.204 కోట్ల గ్రాస్ అందుకుంది. వరల్డ్ వైడ్‌గా రూ.145.95 కోట్ల షేర్ , రూ.263.7 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే మూడో రోజు నాటికే దేవర రూ.305 కోట్ల గ్రాస్ సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది.
నాలుగో రోజు సోమవారం వర్కింగ్ డే కావడంతో దేవర కలెక్షన్లు కాస్తంత నెమ్మదించాయి. నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.8 కోట్లు, హిందీలో రూ.4 కోట్లు, కర్ణాటకలో రూ.10 లక్షలు, తమిళనాడులో రూ.30 లక్షలు, మలయాళంలో రూ.10 లక్షలు కలుపుకుని ఇండియా వైడ్‌గా రూ.13 కోట్ల నికర వసూళ్లను సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్‌లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ చేసిన దేవర 5 మిలియన్ల క్లబ్‌లో చేరాడు.

మరి ఐదో రోజు దేవర ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూస్తే .. తెలుగు రాష్ట్రాల్లో రూ.8 కోట్లు, హిందీలో రూ.5 కోట్లు, కర్ణాటకలో రూ. కోటి, తమిళనాడులో రూ.40 లక్షలు, కేరళలలో రూ.30 లక్షలు చొప్పున ఇండియా వైడ్ రూ.16 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్‌లో మాత్రం ఎన్టీఆర్ ఊచకోత కోస్తున్నాడు. అక్కడ కోటిన్నర నుంచి రూ. 2 కోట్ల వరకు వసూళ్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఐదో రోజు దేవర వరల్డ్ వైడ్‌గా రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా ఫిలింనగర్ టాక్. టోటల్‌గా దేవర ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.360 కోట్ల వరకు గ్రాస్ రాబట్టి, రూ.400 కోట్ల వైపు వేగంగా దూసుకెళ్తోందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











