Devara Day 6 Collections : కుమ్మిపడేస్తోన్న ఎన్టీఆర్.. ఆ హీరో రికార్డ్ గల్లంతు , 6 రోజుల్లో దేవరకు ఎన్ని కోట్ల
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ తదితరులు నటించిన సినిమా దేవర. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో దేవరపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు జనతా గ్యారేజ్ తర్వాత కొరటాలతో ఎన్టీఆర్ కాంబో రిపీట్ కావడంతో దీనికి మరింత హైప్ వచ్చింది. విడుదలై ఆరు రోజులు కావొస్తుండగా .. దేవర ఇప్పటి వరకు ఎంత వసూలు చేశాడో పరిశీలిస్తే :
దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు నిర్మించారు. హైప్‌కు తగినట్లుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో బాగానే హోల్డ్ చేసింది. నైజాంలో రూ.44 కోట్లు, సీడెడ్‌లో రూ.22 కోట్లు, ఆంధ్రాలో రూ.46.55 కోట్లు కలిపి మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటకలో రూ.16 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ. కోటి, ఓవర్సీస్‌లో రూ.27 కోట్లు , ఇండియా వైడ్ రూ.20 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ.182.55 కోట్ల బిజినెస్ జరిగింది. రూ.190 కోట్ల షేర్, రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌గా దేవర జర్నీ స్టార్ట్ చేశాడు.

ప్రపంచవ్యాప్తంగా 7250 థియేటర్‌లలో రిలీజైన దేవర.. ఫస్ట్ వీకెండ్ నాటికి తొలి మూడు రోజులు కలుపుకుని ఏపీ తెలంగాణలలో రూ.87.7 కోట్ల షేర్, రూ.135.1 కోట్ల గ్రాస్ సాధించింది. మూడో రోజు నాటికే దేవర రూ.305 కోట్ల గ్రాస్ సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది. నాలుగో రోజు ఇండియా వైడ్‌గా రూ.13 కోట్ల నికర వసూళ్లు, వరల్డ్ వైడ్‌గా రూ.20 కోట్ల గ్రాస్ సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్‌లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ చేసిన దేవర 5 మిలియన్ల క్లబ్‌లో చేరి బయ్యర్లకు లాభాలను అందిస్తున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల టార్గెట్‌ను రీచ్ అయిన దేవర .. తొలి ఐదు రోజుల్లో నైజాంలో రూ.44 కోట్లు, సీడెడ్‌లో రూ.20.5 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.12 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.7.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.6 కోట్లు, గుంటూరులో రూ.10 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.6.5 కోట్లు, నెల్లూరులో రూ.4.5 కోట్లను సాధించింది. దేవర ఐదో రోజు ఇండియా వైడ్ రూ.16 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.23 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా ఫిలింనగర్ టాక్.

ఆరో రోజు సెలవు దినం కావడంతో చిత్ర యూనిట్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అందుకు తగినట్లుగానే వసూళ్లు రాబట్టింది దేవర. భారత్‌లో రూ.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5 కోట్లతో కలుపుకుని మొత్తంగా ఆరో రోజు రూ.30 కోట్లు వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఆరు రోజుల్లో దేవర రూ.375 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి.. రూ.400 కోట్ల మార్క్ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఓవర్సీస్‌లో 5.31 మిలియన్ డాలర్ల వసూళ్లతో ఆల్ టైమ్ తెలుగు గ్రాసర్స్ లిస్ట్‌లో హనుమాన్‌ను వెనక్కి నెట్టి ఆరో స్థానంలో నిలిచింది దేవర. ఈ మూవీ కంటే ముందు బాహుబలి 2, కల్కి , ఆర్ఆర్ఆర్, సలార్, బాహుబలి ది బిగినింగ్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications











