Devara Day 7 Collections: బాక్సాఫీస్‌ను బాదిపారేస్తోన్న ఎన్టీఆర్.. ప్రభాస్ రికార్డు ఫట్., ఎన్ని కోట్లంటే??
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ తదితరులు కీలకపాత్ర పోషించిన సినిమా దేవర. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ మొదటి భాగం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్‌తో సంబంధం లేకుండా నార్త్, సౌత్, ఓవర్సీస్‌లో ఎన్టీఆర్ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. విడుదలై వారం తిరగకుండానే బ్రేక్ ఈవెన్‌ను క్రాస్ చేసేలా సినిమాను నిలబెట్టాడు. విడుదలై 7 రోజులు కావొస్తుండగా .. దేవర ఇప్పటి వరకు ఎంత వసూలు చేశాడో పరిశీలిస్తే :
దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు నిర్మించారు. నైజాంలో రూ.44 కోట్లు, సీడెడ్‌లో రూ.22 కోట్లు, ఆంధ్రాలో రూ.46.55 కోట్లు కలిపి మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటకలో రూ.16 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ. కోటి, ఓవర్సీస్‌లో రూ.27 కోట్లు , ఇండియా వైడ్ రూ.20 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ.182.55 కోట్ల బిజినెస్ జరిగింది.

ప్రపంచవ్యాప్తంగా 7250 థియేటర్‌లలో రిలీజైంది దేవర.. మొదటి రోజు రూ.172 కోట్లు, రెండో రోజు రూ.71 కోట్లు, మూడో రోజు రూ. 40 కోట్లు, నాలుగో రోజు రూ. 25 కోట్లు, ఐదో రోజు రూ.40కోట్లు, ఆరో రోజు రూ.40 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏడో రోజైన గురువారం సాయంత్రం నాటికే రూ.396 కోట్ల కలెక్షన్లను దేవర వసూలు చేసినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్ - యువసుధ ఆర్ట్స్‌లు అధికారికంగా ప్రకటించాయి.
మరోవైపు.. రాయలసీమలో ఎన్టీఆర్ దేవర ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి వారమే ఆల్‌టైం టాప్ 2 బిగ్గెస్ట్ షేర్ కలెక్షన్స్‌ని అందుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆరు రోజుల పాటు ప్రతిరోజూ రూ.కోటికి తగ్గకుండా దేవర షేర్ రాబట్టింది సరికొత్త రికార్డులు సృష్టించింది. ప్రభాస్ గత చిత్రాలు సలార్, కల్కిలు రోజుకు రూ. కోటికి తక్కువ కాకుండా వరుసగా 5 రోజులూ ఈ ఘనత సాధించాయి. ఇప్పుడు ఎన్టీఆర్ 6 రోజుల పాటు ఏకధాటిగా రోజుకు కోటి రాబట్టి సత్తా చాటాడు.

ఇక ఏడవ రోజు దేవర వసూళ్లలోకి వెళితే.. గురువారం ఫుల్ వర్కింగ్ డే కావడంతో టికెట్ బుకింగ్స్ మందగించాయి. అయినప్పటికీ ఫస్ట్ షో నుంచి బుకింగ్స్ బాగానే బుక్ అయ్యాయి. ఏడో రోజూ.. తెలుగు రాష్ట్రాల్లో రూ.8 కోట్లు కర్ణాటక, తమిళనాడు, హిందీ రెస్టాఫ్ ఇండియా కలుపుకుని రూ.6 కోట్ల గ్రాస్ రాబట్టింది. మొత్తంగా దేవర ఏడో రోజు ఇండియా వైడ్‌గా రూ.7.75 కోట్ల నికర లాభాలను అందుకుంది. ఓవర్సీస్‌లో 7వ రోజు రూ. 80 లక్షలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా దేవర 7వ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.15 కోట్ల గ్రాస్ రాబట్టింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, హిందీ బెల్ట్, ఓవర్సీస్‌లో దేవరకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దసరా సెలవులు ప్రారంభం కావడంతో పాటు మార్కెట్‌లో మరో పెద్ద సినిమా లేకపోవడం దేవరకు కలిసొచ్చే అంశం. ఫుల్ రన్‌లో ఎన్టీఆర్ మూవీ దాదాపు రూ.500 కోట్ల వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











