Devara Day 7 Collections : ఆరు రోజుల్లో దేవరకు రూ.396 కోట్లు.. ఏడో రోజు ఎన్టీఆర్ మూవీకి ఎన్ని కోట్లంటే?
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ తదితరులు నటించిన సినిమా దేవర. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలుత మిక్స్‌డ్ టాక్ రాగా వసూళ్లు నెమ్మదిస్తాయని అంతా భావించారు. కానీ ఎన్టీఆర్ ఆ లెక్కలను తారుమారు చేశారు. వారం తిరిగే సరికి బ్రేక్ ఈవెన్‌ను క్రాస్ చేసేలా తారక్ మేజిక్ చేశారు. విడుదలై 7 రోజులు కావొస్తుండగా .. దేవర ఇప్పటి వరకు ఎంత వసూలు చేశాడో పరిశీలిస్తే :
దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు నిర్మించారు. నైజాంలో రూ.44 కోట్లు, సీడెడ్‌లో రూ.22 కోట్లు, ఆంధ్రాలో రూ.46.55 కోట్లు కలిపి మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటకలో రూ.16 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ. కోటి, ఓవర్సీస్‌లో రూ.27 కోట్లు , ఇండియా వైడ్ రూ.20 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ.182.55 కోట్ల బిజినెస్ జరిగింది.

ప్రపంచవ్యాప్తంగా 7250 థియేటర్‌లలో రిలీజైంది దేవర.. మొదటి రోజు రూ.172 కోట్లు, రెండో రోజు రూ.71 కోట్లు, మూడో రోజు రూ. 40 కోట్లు, నాలుగో రోజు రూ. 25 కోట్లు, ఐదో రోజు రూ.40కోట్లు, ఆరో రోజు రూ.40 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఏడో రోజు ఇప్పటి వరకు రూ.396 కోట్ల కలెక్షన్లను దేవర వసూలు చేసినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ - యువసుధ ఆర్ట్స్‌లు అధికారికంగా ప్రకటించాయి. ఓవర్సీస్‌లో 5.31 మిలియన్ డాలర్ల వసూళ్లతో ఆల్ టైమ్ తెలుగు గ్రాసర్స్ లిస్ట్‌లో హనుమాన్‌ను వెనక్కి నెట్టి ఆరో స్థానంలో నిలిచింది దేవర. ఈ మూవీ కంటే ముందు బాహుబలి 2, కల్కి , ఆర్ఆర్ఆర్, సలార్, బాహుబలి ది బిగినింగ్ ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, హిందీ బెల్ట్, ఓవర్సీస్‌లో దేవరకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దసరా సెలవులు ప్రారంభం కావడంతో పాటు మార్కెట్‌లో మరో పెద్ద సినిమా లేకపోవడం దేవరకు కలిసొచ్చే అంశం. ఫుల్ రన్‌లో ఎన్టీఆర్ మూవీ దాదాపు రూ.500 కోట్ల వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఏడు రోజు దేవర ఎన్ని కోట్లు వసూలు చేస్తుందనే దానిపై సోషల్ మీడియాలో పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. 6వ రోజుతో పోల్చితే గురువారం వర్కింగ్ డే కావడంతో టికెట్ బుకింగ్స్ స్వల్పంగా పడిపోయినట్లుగా టాక్. ఫస్ట్ షో నుంచి బుకింగ్స్ అందుకుంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా. దీనిని బట్టి దేవరకు ఏడో రోజూ.. తెలుగు రాష్ట్రాల్లో రూ.8 నుంచి రూ.10 కోట్ల మధ్యలో గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. కర్ణాటక, తమిళనాడు, హిందీ రెస్టాఫ్ ఇండియా కలుపుకుని రూ.10 కోట్లు వరకు అందుకోవచ్చని అంటున్నారు. ఓవర్సీస్‌లో ఎప్పటిలాగే దేవర జైత్రయాత్ర కొనసాగుతుందని 7వ రోజు రూ. కోటి వరకు లాగొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం దేవర 7వ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.15 నుంచి రూ.20 కోట్ల వరకు వసూళ్లు రాబట్ట వచ్చని అంటున్నారు.


Click it and Unblock the Notifications











