Devara Day 8 Collections:NTRమాస్ ర్యాంపేజ్..ఫస్ట్ వీక్‌కే టార్గెట్ ఫినిష్,8వ రోజు దేవరకు ఎన్ని కోట్లంటే?
కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా దేవర అంచనాలను మించి రాణిస్తోంది. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ ఎన్టీఆర్ వన్ మేన్ షో కారణంగా సాలీడ్ వసూళ్లు వస్తున్నాయి. ప్రమోషన్లు, టీజర్, ట్రైలర్ దేవరపై భారీ హైప్ తీసుకొచ్చాయి. పైగా ఆర్ఆర్ఆర్ చేసిన రెండేళ్లకు ఎన్టీఆర్ నటించిన సోలో మూవీ కావడంతో ప్రేక్షకుల తాకిడి ఓ రేంజ్‌లో ఉంది. కలెక్షన్స్‌ని బట్టి ఈ విషయం చెప్పొచ్చు. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన దేవర 8 రోజుల్లో ఎంత వసూలు చేశాడో చూస్తే
దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు
సంయుక్తంగా నిర్మించారు. ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్ కావడంతో , పైగా ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల తనను తాను నిరూపించుకోవాలని తీసిన సినిమా కావడంతో దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. నార్త్ , సౌత్, ఓవర్సీస్‌లో దేవర డిస్ట్రిబ్యూషన్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

నైజాంలో రూ.44 కోట్లు, సీడెడ్‌లో రూ.22 కోట్లు, ఆంధ్రాలో రూ.46.55 కోట్లు కలిపి మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటకలో రూ.16 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ. కోటి, ఓవర్సీస్‌లో రూ.27 కోట్లు , ఇండియా వైడ్ రూ.20 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ.182.55 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తో దేవర బరిలో దిగింది.
ప్రపంచవ్యాప్తంగా 7250 థియేటర్‌లలో రిలీజైంది దేవర.. మొదటి రోజు రూ.172 కోట్లు, రెండో రోజు రూ.71 కోట్లు, మూడో రోజు రూ. 40 కోట్లు, నాలుగో రోజు రూ. 25 కోట్లు, ఐదో రోజు రూ.40కోట్లు, ఆరో రోజు రూ.40 కోట్లు, ఏడో రోజు రూ.20 కోట్ల గ్రాస్ వసూళ్లను దేవర రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. 8వ రోజు మార్నింగ్ షో నాటికే దేవర బ్రేక్ ఈవెన్ మార్క్‌ను క్రాస్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. వీకెండ్‌లోనే కాదు, వీక్ డేస్‌లోనూ చితక్కొట్టిన దేవర వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడిని తిరిగి తెచ్చింది.

దేవర ఫస్ట్ వీక్‌లో ఇండియా వైడ్‌గా రూ.215.6 కోట్ల నికర వసూళ్లను సాధించింది. తెలుగులో రూ.164 కోట్లు, హిందీలో రూ.44 కోట్లు, కర్ణాటకలో రూ.1.58 కోట్లు, తమిళనాడులో రూ.4.8 కోట్లు, మలయాళంలో రూ.1.22 కోట్ల వసూళ్లను సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఎనిమిదో రోజు వసూళ్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్లు, హిందీలో రూ. 3 కోట్లు, తమిళ్, కర్ణాటక, ఓవర్సీస్‌లలో రూ.2 కోట్ల వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా 8వ రోజు దేవర వరల్డ్ వైడ్‌గా రూ.13 కోట్లు రాబట్టినట్లుగా ఫిలింనగర్ టాక్.
దసరా సెలవులు ప్రారంభం కావడంతో పాటు మార్కెట్‌లో మరో పెద్ద సినిమా లేకపోవడంతో రూ.500 కోట్ల టార్గెట్ దిశగా దేవర దూసుకెళ్తున్నాడు.


Click it and Unblock the Notifications











