Devara Total Collections : దేవర టోటల్ కలెక్షన్లు .. ఎన్టీఆర్ మూవీకి లాభమెంత? నష్టమెంత?

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసినట్లేనని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీపావళికి దాదాపు అరడజను కొత్త సినిమాలు రిలీజ్ కావడంతో దేవర థియేటర్ల సంఖ్య తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో 34 రోజుల పాటు ఎన్టీఆర్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? మేకర్స్‌కు ఎన్ని కోట్ల లాభాలను అందించింది? ఈ వివరాల్లోకి వెళితే :

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ , ప్రచార కార్యక్రమాలు ఇతర ఖర్చులు కలుపుకుని దేవరను రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కించారు.. జాన్వీ కపూర్ , సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. దేవర ద్వారా జాన్వీ, సైఫ్‌లు టాలీవుడ్‌లో అడుగుపెట్టారు.

Recommended Video

Devara Total Boxoffice Collections సినిమాను నమ్ముకున్న కుటుంబాలను నిలబెట్టిన Jr NTR | FilmiBeat

Jr NTR s Devara Total Box Office Collections Worldwide here s the details

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో పాటు కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా. దీంతో రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌‌గా విలువ కట్టారు ట్రేడ్ పండితులు .

మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా 34 రోజుల లాంగ్ రన్ సొంతం చేసుకుందంటే దానికి కారణం ఎన్టీఆర్ మాస్ ఇమేజ్, దీనికి దసరా కలిసిరావడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. మధ్యలో రజనీకాంత్ నటించిన వేట్టయన్ సహా పలు చిన్నా పెద్దా సినిమాలు పోటెత్తినా ఎన్టీఆర్ ఊచకోత ఆగలేదు. వీకెండ్స్‌లో ఎక్స్‌లెంట్ హోల్డ్ చూపిస్తూ భారీ వసూళ్లను రాబట్టింది దేవర. మొత్తంగా దీపావళి 34 రోజుల పాటు సాగిన ఎన్టీఆర్ ఊచకోతను గమనిస్తే..

Jr NTR s Devara Total Box Office Collections Worldwide here s the details

నైజాంలో రూ. 62.82 కోట్లు, సీడెడ్‌లో రూ.31.71 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 18.50 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 10.69 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ. 8.42 కోట్లు, గుంటూరులో రూ. 13.65 కోట్లు, కృష్ణాలో రూ.9.32 కోట్లు, నెల్లూరులో రూ.6.97 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 162.08 కోట్ల షేర్.. రూ. 236.35 కోట్ల గ్రాస్ సాధించింది. ఇక కర్ణాటకలో రూ.18.20 కోట్లు, తమిళనాడు రూ. 4.16 కోట్లు, కేరళలో రూ. 97 లక్షలు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 34.53 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 36.11 కోట్లు చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 447.45 కోట్ల గ్రాస్.. రూ. 256. 05 కోట్ల షేర్‌ను రాబట్టాడు దేవర.

మొత్తంగా రూ. 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు గాను.. 34 రోజుల్లో రూ. 72 కోట్లకు పైగా లాభాలను అందించి.. బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది దేవర. ఇవి కాక డిజిటల్ , శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ ద్వారా నిర్మాతలకు కళ్లు చెదిరే ప్రాఫిట్స్‌ను తెచ్చిపెట్టాడు ఎన్టీఆర్. వీటికి సంబంధించిన పూర్తి లెక్కలు త్వరలోనే బయటకు రానున్నాయి.

More from Filmibeat

Read more about: jr ntr devara koratala siva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X